పేదరికమా?.. ఎక్కడ?భారతదేశం పేదదేశం` కాని! భారతీయులు పేదవారు కాదుఅన్నాడు ఒకాయన. అదేమిటయ్యా ప్రజలు ధనవంతులైతే దేశం పేదది ఎలా ఔతుంది అని ప్రశ్నించాడు ఇంకొకాయన. దానికి సమాధానంగా మొదటి వ్యక్తి అంటాడు కదా! కొంతమంది భారతీయులు స్వీస్ బ్యాంకులో రహస్యంగా డబ్బు దాచుకున్నారు. మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా 280 లక్షల కోట్లు మాత్రమే. ధనాన్ని భారత దేశానికి తరలిస్తే 30 సంవత్సరాలు దేశం పన్ను వేయకుండానే పరిపాలన చేయవచ్చు. 60 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు. ప్రపంచ బ్యాకు నుండి గాని,అంతర్జాతీయ ద్రవ్యనిధి నుండి గాని మనం రుణాలు తీసుకోనక్కరలేదు.