భగవాధ్వజం మన గురువు


హితవచనం
ఎవరిని గురువుగా భావించి నిత్యము పూజించవలసి ఉందో వారి సద్గుణాలను మనలో వికశింప చేసుకోవాలి, అలా సద్గుణాలు వికశించనిదే మన కర్తవ్యం పూర్తి అయినట్లు కాదు. గురువుతో మరింత, మరింతగా ఏకాత్మతను సాధించే దిశలో ప్రయాణించుటకు నిజమైన సాధన, శివుడిని ఉపాసిస్తూ క్రమంగా తానే శివుడై పోవాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మనం సమాజంలో జీవన రంగాలో ఉన్న ఇటువంటి హృదయ తీవ్రతతో పని చేస్తూ ప్రతివారి నోట మన పేరే స్మరింపబడే విధంగా వ్యవహరించాలి. రాష్ట్ర జీవితానికి సర్వం సమర్పణ చేసే భావము మనలో నిర్మాణం కావాలి.  మన రాష్ట్రం యొక్క ప్రత్యక్ష రూపాన్ని  గోచరింపజేసేది యజ్ఞ జ్వాలకు ప్రతీక, ఉదయ భానుని ధ్వజం అయిన భగవాధ్వజాన్ని మనం రాష్ట్రం ధ్వజంగా స్వీకరించాము. ధ్వజానికి తనుమనధన పూర్వకంగా చేసే సముర్పణే నిజమైన గురుపూజ అవుతుంది.
- పూశ్రీ గురూజీ, ద్వితీయ సర్సంఘచాకు, రా.స్వ.సే.సంఘము