అమెరికాలో పెచ్చరిలుతున్న తుపాకీ సంస్కృతివాషింగ్టన్: అమెరికాలో తుపాకీ సంస్కృతి పెచ్చర్లితున్నది. కొందరు ఉన్మాదులు ఇష్టమొచ్చినట్లు జనాలపై కాలుపులకు తెగబడుతున్నారు. ఇలా అమెరికాలో ఏడాదిలో ఇప్పటివరకు 200సార్లు సామూహిక కాలుపుల ఘటను జరిగినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక వ్లెడించింది. తాజాగా లూసియానలోని సినిమా థియేటర్లో కాలుపులు జరుగగా నిందితుడితోపాటు ముగ్గురు మృతిచెందినట్లు తెలిపింది. సంవత్సరం ఏప్రిల్లో 18, మేలో 39, జూన్లో 41, జూలైలో ఇప్పటి వరకు 34 ఘటను జరిగాయి. లూసియాన థియేటర్లో కాలుపులు జరగడం ఏడాదిలో ఇది ఎనిమిదోసారి. వోహియోలో పది, కాలిఫోర్నియాలో 14, న్యూయార్క్లో 16 సార్లు కాలుపులు జరిగినట్లు పత్రిక వెల్లడించింది. లూసియాన థియేటర్ కాలుపులతో మొత్తం ఘటన సంఖ్య 204కు చేరినట్లు పేర్కొన్నది. కాలుపులు జరిగిన ప్రతిసారి నలుగురు అంతకంటే ఎక్కువ సంఖ్యలో జనం చనిపోతున్నట్లు ఎఫ్బీఐ సీనియర్ అధికారి  వెల్లడించారు. దక్షిణ కెరొలినలోని చార్లెస్టన్ చారిత్రక చర్చిలో త్లెజాతీయుడు కాలుపులకు దిగడంతో తొమ్మిది మంది నల్లజాతీయులు చనిపోయిన విషయం తెలిసిందే.