సమస్యల యెడల సమాన స్పంద ఎందుకు ఉండదు?

దేశంలో సామరస్యము, సమరసత నిర్మాణము కావాలని అందరం కోరుకొంటాము. హిందూ సమాజం` హిందూ సమాజంగా స్పందించటము చూడాలని కోరుకొంటాము. దేశ సమస్య యెడల సమాన స్పందన దేశంలో అరుదుగా కనబడుతూ ఉంటుంది. దేశంలో కొందరు దేశ సమస్య ఆధారంగా హిందూ సమాజాన్ని చీల్చాని ప్రయత్నిస్తున్నారు. దేశంలో వైషమ్యాలను పెంచేందుకు కొందరుపని చేస్తున్నట్లుగా కనబడుతున్నది.
మధ్య కాలంలో జరిగిన రెండు సందర్భాలపై మేధావుల స్పందనను గమనిస్తే మనకు అర్థమవుతుంది. గోదావరి పుష్కరాల సమయంలో పుష్కర స్నానాలు ఎంతమంది దళితులు చేసారు అని కొందరు ప్రశ్నిస్తే, జనాలను రెచ్చగొట్టి పుష్కర స్నానాలకు వెళ్ళేట్లు చేసారని ఇంకా కొందరు దాడి ప్రారంభించారు. భక్తి శ్రద్ధలతో పాల్గొనే కార్యక్రమాలలో ప్రజలు ఎవరు పాల్గొన్నారు? కులం వాళ్ళు పాల్గొన్నారు అని ఎవరైనా చెప్పగలుగుతారు. సమయంలో ఇటువంటి ఆలోచననూ, ఇటువంటి ప్రశ్నను వేసే వారిని ఎట్లా అర్థం చేసుకోవాలి?
ముంబాయిలో వరుసబాంబు పేలుళ్ళకు కీలకమైన వ్యక్తికి సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఖరారుచేసి తీర్పునిస్తే దానికి వ్యతిరేకంగా అనేకమంది గళాలు ఎత్తారు. దేశ సమగ్రతకు సార్వభౌమత్యానికి సవాలు విసిరే వారికి విచక్షణరహితంగా హత్యలు చేసే వారికి క్షమాభిక్ష పెట్టాలని ఆడగటం ఎట్లా అర్థం చేసుకోవాలి. ఉరిశిక్ష ఉండాలా వద్దా? శిక్ష ఎట్లా ఉండాలి అనేది చర్చ జరిగితే జరగవచ్చు. దేశ సార్వభౌత్యానికే సవాలు విసిరే వారికి ఎటువంటి శిక్ష వెయ్యాలి? ఇటువంటి ప్రశ్నలు వేసే మేధావులు ఏమికోరు కుంటున్నారు. దానిని ప్రజలు గమనించాలి.