ఈవార్తలు చదివారా?ఇండియా అనాలా ? భారత్ అనాలా ?
మహారాష్ట్రలోని నిరంజన్ భట్వాల్ అనే ఒక సామాజిక కార్యకర్త ‘‘భారతదేశానికి ఇండియా అనే పేరు తొలగించిభారత్అనిగాని, హిందుస్తాన్గాని పేరు పెట్టాలి’’ అని సుప్రీంకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. మన రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న సమయంలో హిందుస్తాన్, భారత్, ఆర్యావర్తం లాంటి పేర్లు పరిశీలించారు. కానీ ఇండియా అనే పేరు కొనసాగుతున్నదని నిరంజన్ వాదించారు.
ఇండియాగా కొనసాగుతున్న మన దేశాన్ని భారత్ అని ఎందుకు అనరాదో వివరించాలని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాులు మరియు కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ అరుణ్ మిశ్రాలు నోటీసులు పంపారు.
అహో.. భారత సైన్యం..’ అంటున్న యువతి
బీబీ అవ్యాబెగర్ఈజిప్టు దేశానికి చెందిన ఒక ముస్లిం యువతి. వయస్సు 20 సంవత్సరాలు. ఇటీవల ఆమె ఫేస్బుక్లో భారత సైన్యాన్ని పొగుడుతూ ఒక పోస్టు చేసింది. భారత సైన్యం మానవత్వం, మంచితనం కారణంగా నేను ఇవ్వాళ జీవించి ఉన్నాను. యెమెన్ తురక మూక మారణకాండలో చిక్కుకున్న తనను భారతసైన్యం కాపాడడమే కాకుండా భోజనం పెట్టి, వైద్యసౌకర్యం కల్పించి సకల సౌకర్యాలు కల్పించిందని ఆమె చెప్పారు. జాతి, మతభేదం చూపకుండా వివిధ దేశీయులను మనసైన్యం కాపాడిన వైనం ఆమె వివరంగా ఫేస్బుక్లో పెట్టారు. పోస్టుకు ప్రపంచవ్యాప్తంగా లైక్లు వచ్చాయి. యుద్ధరంగంలోనే కాదు, మానవ సేవలోకూడా మనసైన్యం ప్రపంచఖ్యాతి గడించింది.
మల్టీ టాస్కింగ్ మెదడును దెబ్బతీస్తుంది
ఇంటికోడి పప్పు మెతుకుతో సమానంఅనే ఒక తురక సామెత ఉన్నది. మన పెద్దలు చెప్పిన ప్రాచీన జ్ఞానం ` నీతులను మనం హేళన చేస్తాం. ఇటీవల తరచుగా వినపడుతున్న పదం ‘‘మల్టీ టాస్కింగ్ . అనగా ఒకేసారి వివిధరకాల  కార్యాలు ఒకే సమయంలో చేపట్టడం. ఇది మనంనిదానమే ప్రదానం అన్న సూక్తికి వ్యతిరేకం. నేటి యువతరం ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పని చేసేవారు ‘‘మల్టీ టాస్కింగ్చేస్తూ ఉంటారు.
తెల్లవాడు ఇంగ్లీష్లో చెపితేనేకాని మనం వినం. అదే తెల్లవాడు ఇంగ్లీషులో ఏమంటున్నాడో చూడండి. ‘‘ఒకేసారి రెండు మూడు పనులు చేయడం (మల్టీ టాస్కింగ్) ఏమీ ప్రత్యేక నైపుణ్యం కాదు, పైగాఐక్యూఒకేసారి 15 పాయింట్లు పడిపోతుంది. మెదడు తన ఆలోచను ఒక క్రమంలో పెట్టుకోవడంలో విఫమౌతుంది. కారణంగా గందరగోళంలో పడిపోతుంది. లండన్ విశ్వవిద్యాయం వారు విస్తృత పరిశోధనలు చేసి పై విషయాలు ప్రకటించారు. కాబట్టి మనపెద్దలు చెప్పినమాట చద్ది అన్నం మూటఅని మరువరాదు.
ఆగని కిరస్తానీ కుతంత్రాలు
అది పవిత్రనృసింహస్వామి దేవాలయం, యాదగిరిగుట్ట. భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్నవేళ, సుప్రభాతాలూ, నృసింహస్తోత్రాలూ వినపడవలసిన పరిసరాల్లో ‘‘ఏసు నీ నామామృతమే మాకెంతో రుచి అయ్యాఅనే గీతాలాపన జరు గుతోంది. యాదగిరి పట్టణంలో చర్చిలు తక్కు వేమీ లేవు. నలుగురు బ్రదర్స్ గుట్టమీద తిరుగుతూ క్రైస్తవమత ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు పంచుతున్నారు. దేవునిబిడ్డను మాత్రమే నమ్మాలని ప్రబోధిస్తున్నారు. దేవాలయ సిబ్బంది ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పోలీసులు చర్యతీసుకుని నలుగురు క్రైస్తవులను గుర్తించారు. కందుల రమేశ్, సోమన్న, దావీదు మరియు రమేశ్ అనే కిరస్తానీ ప్రచారకుల వద్ద నుండి పోస్టర్లు, సువార్త సాహిత్యం, కరపత్రాలు స్వాధీనం చేసుకుని నుగురినిఅరెస్టు చేసారు. (తరువాత బెయిులుపై వదిలేశారు). ఆలయ నిర్వాహక అధికారి శ్రీమతి ఎన్.గీత మాట్లా డుతూ `‘‘ఇటువంటి మతమార్పిడి చర్యను ఇకమీద సహించముఅన్నారు. కానీ కిరస్తానీ ఆగడాలు మాత్రం ఆగటం లేదు.