జాతీయ నాయకుడు డా॥అంబేడ్కర్‌

 
బాబాసాహెబ్ అంబేడ్కర్ గురించి తరచుగా చెప్పే విషయాలు ‘‘సామాజిక న్యాయం కోసం పోరాటం. భారత రాజ్యాంగకర్త, దళిత సంరక్షుడు, ధమ్మ పరివర్తక అనిఉంటాయి. ఇవి ఏవి అంబేడ్కర్ పూర్తి వ్యక్తిత్వాన్ని తెలియజేయలేవు. సమాజంలో అంటరానితనం రూపుమాపాలి, అన్ని మతాలు, సాంప్రదాయాలు, కులా మధ్య అంతరాలు తొగిపోవాలి. సమాజంలో వివక్షత అనేది ఉండకూడదు అని చెప్పేవారు.
సామాజిక న్యాయం`జాతీయ భావం రెండు అంబేడ్కర్ జీవితంలో రెండు పార్శ్వాులు. నాణానికి రెండు ప్రక్క రెండు విషయాలు. అంబెడ్కర్  దేశంలో బ్రిటీష్ పాలన తరువాత దేశపు నవీన జాతీయభావాన్ని వికసింప జేసేందుకు ప్రయత్నించినవాడు. జాతి అంటే ప్రజులు,భూమి, సంస్కృతి. భూమి దేశ నిర్మాణానికి, సంస్కృతి  దేశ ప్రజలను  ఒక్కటిగా  ఉంచటానికి. 1916 సంవత్సరం కొలంబియా యూనివర్సిటీలోఇండియాలో కులాలు’ (aర్‌ - ఱఅ- Iఅసఱa) అనే అంశముపై పేపర్ ప్రెజెంట్ చేసారు. భారతదేశంలో కులం అనేది ఒక భౌగోళిక ఐక్యత మాత్రమే కాదు, ఇది ఒక సాంస్కృతిక ఐక్యత. ఇది దేశం చివర నుండి చివర వరకు ఒక్కటిగానే ఉంది. కాని ఈరోజు అదే దేశానికి ఒక సమస్యై కూర్చొంది. దానిని  సవరించడం కూడా కష్టం అని వివరించారు.
దేశం, జాతి వివిధ జాతులుగా సమూహాలుగా కనబడవచ్చు, కాని సాంస్కృతికంగా పటిష్టంగా ఉంది. ప్రపంచంలో జాతైనా సంస్కృతి లేకుండా నిబడలేదు. సాంస్కృతిక ఐక్యత, సామాజిక ఐక్యత రెండూ కూడా జాతి నిబడేందుకు మూలం అని వివరించారు. అంటే దేశంలో సామాజిక ఐక్యతను సాధించాలని అంబెడ్కర్ చెప్పేవారు. కాని భారతదేశంలో రోజున ఉన్న దృశ్యం సామాజిక అసమానత.
దేశంలో సామాజిక అసమానతకు మూంల కులం. దేశంలో అసమానతలు `అన్యాయాలు 1) ఆర్థికంగా 2) సామాజికంగా 3) రాజకీయంగా 4) మతపరంగా 5) సాంస్కృ తికపరంగా అన్యాయం జరుగుతుంది. స్వయంగా అంటరాని కుటుంబంలో పుట్టిన అంబేడ్కర్ అనేక అన్యాయాలు, అసమానతలను ఎదుర్కొన్నారు. దానిని రూపుమాపటానికి సంస్థల పరంగా, రాజ్యాంగ పరంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేసారు.
కమ్యూనిజాన్ని వ్యతిరేకించిన అంబేడ్కర్ రష్యా విస్తరణ వాదమును చూసి చెప్పిన మాటలు ‘‘నిరంతరం ఆక్రమణతో అనేకమంది ప్రజలను నిర్మూలించే ప్రయత్నం రష్యా చేసుకొంటూ వచ్చింది. ‘వాళ్ళను స్వతంత్రులను చేస్తున్నాముఅనే నినాదంతో అందరిని తన గుప్పె ట్లోకి తెచ్చుకొనే ప్రయత్నం రష్యా చేస్తున్నది. కమ్యూనిజం అనేది అడవిలో దావానం (అడ విలో అంటుకున్న అగ్ని) లాంటిది. దావానం అన్నింటిని రూపుమాపేస్తుంది అని చెప్పారు అంబేడ్కర్. దావానంలో జీవించకూడదు, ప్రజాస్వామ్యం`కమ్యూనిజం రెండు ఒకేచోట పొసగని వ్యవస్థలు. రెండు కలిసి ముందుకు పోవటం సాధ్యం కాదు. కమ్యూనిజం గురించి ఇంత స్పష్టంగా అంబేడ్కర్ చెప్పారు.
అట్లాగే ఇస్లాం గురించి కూడా అంబేడ్కర్కు స్పష్టమైన ఆలోచనలు ఉండేవి. అంబేడ్కర్  వ్రాసినపాకిస్థాన్,భారతదేశ విభజనఅనే  పుస్తకంలో స్పష్టంగా ఇస్లాం గురించి వ్రాసారు. ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మతము, ప్రపంచమతము, అందరికి, అన్నిచోట్ల వర్తించేది అని చెబుతారు, ఇస్లాంలో సహోదరత్వం ` ఇస్లాంలో ఉన్న వారికే వర్తిస్తుంది, ప్రపంచ మానవ సహోదరత్వంను ఇది అంగీకరించదు. ముస్లిం కాని వాడికి ఇస్లాంలో స్థానం లేదు, స్థానం కల్పించబడదు, ఇస్లాం అనేది ముస్లిం పాలనలోనే ఉండాలి, ముస్లిం పాలనలో లేని రాజ్యాలు దేశాలు శతృదేశాలుగా పరిగణించబడ తాయి. ఇవన్నీ గమనించినప్పుడు ఒక నిజమైన ముస్లిం భారత్ను తమ మాతృభూమిగా భావించ లేడు, హిందువు భావించగలుగుతారు.  ఆక్రమణ మనస్తత్వం కలిగినది ఇస్లాం. విషయాలు చెబుతూనే హిందువుల బహీనతలను, దానివల్ల కలగుతున్న నష్టాలను కూడా వివరిం చారు. దేశ విభజనకు సిద్ధమవుతున్న సమయం లో దేశంలో అందులో ప్రముఖంగా బెంగాల్్ కాశ్మీర్లో జరుగుచున్న దాడులు కలహాలను వివరిస్తూ ఒకవేళ మతం ఆధారంగా దేశం విభజించబడాలంటే హిందువులు`ముస్లింలు విడివిడిగా ఉండాలి. విడిపోయిన భూభాగాల నుండి హిందువులందరిని భారత్ చేర్చాలి, భారత్లో ఉన్న ముస్లింలందరిని విడిపోయిన భూభాగాలకు పంపి వేయాలని సూచించారు.
ఇట్లా అంబేడ్కర్ జాతీయ దృష్టికోణం స్పష్టంగా ఉండేది. అంబేడ్కర్ దళిత వర్గాల ప్రజ సంరక్షణకు ఎట్లా కృషి చేసారో, జాతీయ భావ పటిష్టతకు అంతే కృషి చేసారు. అంబేడ్కర్ను ఒక జాతీయనాయకుడిగా చూసినప్పుడు మనం నిజంగా అంబేడ్కర్ను అర్థం చేసుకోగలము.