జీవన` సంజీవనం` సాత్విక ఆహారం శాకాహారం ఆరోగ్య రక్షణకవచం

శాకాహారమే జీవన ఆధారం. భారతీయ సంస్కృతితో పట్టిష్టమైన ప్రగాఢమైన సంబంధంమిళితమె ఉన్నదని తెలియజేయబడినది. కనుకనే ఆధ్యాత్మిక, నైతిక, ఆర్థిక, ప్రాకృతిక, యోగ, పర్యావరణం మరియు అహింసా దృష్టితో చూసినట్లైతే శాకాహారమే ఉత్తమమైనదని నిర్వివాదాంశము. అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే రోజుల్లో పాశ్చాత్య దేశాలు శాకాహారం వైపు ఆకర్షితులై తమ నిత్య జీవితంలో దీనికి పెద్దపీట వేస్తున్నారంటే దానికి ప్రధాన కారణం సదా ఆరోగ్యంగా` చురుకుగా ఉండాలన్నదే ప్రాధన్యత సంతరించుకున్న అంశం. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఆర్యోగ విశేషజ్ఞు తమ పరిశోధనలో మాంసాహారము కంటే శాకాహారములోనే మాంసకృత్తు, చాలినంతవరకు ప్రోటీన్లు, కార్పోహైడ్రేట్స్, మరియు క్యాలరీలు కలిగి ఉన్నాయని దిగువ పట్టిక ద్వారా విశదీకరించారు.
పట్టిక ద్వారా తెలిసిందేమంటే మాంస హారం ద్వార కొవ్వు పెరుగుతుందే తప్పా ఆరోగ్యాని కవసరమగు ప్రోటీన్స్, కెలోరీలు కాదన్నమాట. ప్రోటీన్, కెలోరీలు, మరియు కార్బోహైడ్రోట్స్కై శాకాహారమే ఉత్తమమైనదని, మాంసహారము కాదని తేట తెల్లమౌతుంది. గుడ్డు, మాంసం, చేపకంటే పండ్లు` అరటి, మామిడి, ద్రాక్ష, జామ, ఆపిల్, దానిమ్మాలో అధికంగా అవి లభ్యమౌతాయని, పప్పుదినుసు, ఆలుగడ్డ, పాలీష్ చెయ్యని బియ్యం అవసరమగు కార్పోహైడ్రోట్స్ అందిస్తుందని సుస్పష్టమౌతూ ఉన్నది. ఇంతేకాదు రకరకాల విటమిన్లు మరియు ఖనీజ పదార్థాలు కూడా అవస రంమేరకు పండ్లు` కూరగాయలు` పప్పుదినులో` పాలలోనే అధికంగా భ్యమౌతా యని తెలియజేయటం జరిగినది.
అనేక సార్లు చికిత్సకు సైతం రోగ`గ్రస్థులకు మాంసకృత్తులు` ప్రోటీన్లు భ్యమౌతాయని విశేషంగాగుడ్డు లేదా మాంసంతీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. మాంసహారులు మాట్లాడుతూ ఉంటారు.ఆరోగ్యంగా ఉండడానికి భోజన సామా గ్రిలో ప్రోటీన్లు పెంపొందించే అంశాలుండటం అనేది నిజమే` అవి మాంసం ద్వారా భ్యమౌతాయనేది యదార్థమే కాని కేవలంమాంసంగుడ్డద్వారా లభిస్తాయనేది అవాస్తవమని విదేశీయులు సైతం నేడు రుజువు చేస్తు` పాటిస్తున్నారు. మన నేటి పరిజ్ఞానమెంత విశ్వసనీయమైనదంటే, విదేశీయులు చెప్పనంత వరకు, విదేశీభాషలో తెలియజేయనంతవరకు మనం నమ్మలేకున్నాము` నమ్మిన ఆచరించలేకున్నాము. భారత ప్రభుత్వం ఆరోగ్య సూత్రసూచనపత్రం 23 ద్వారా కూడా తినుభండారాలో తులనాత్మక పరిశోధన ద్వారా ప్రోటీన్స్, కైలోరీు మరియుఊర్జా దృష్ట్యా వివిధ వస్తువులను పరిశీలించి సూచి ఇవ్వడం జరిగింది.
అందుకనే సాత్విక ఆహారం ద్వారానే సాత్విక వ్యవహారం అవాటు పడుతుందని. సాత్విక ఆహా రమనేది మాంసహారం మినహా మంసకృతులు లభింపజేసే పండ్లు` కూరగాయలు` పప్పుదినుసులు, పాలు,`పెరుగు`నెయ్యి సమపార్శంలో విని యోగిస్తూనూనేకారం` ఉప్పు చక్కరను సాధ్య మైనంత వరకు మితముగా వాడుట అలవాటు గా చేసుకోవాల ని ఆరోగ్యసూత్రం విశదీకరిస్తు ఉన్నది.. (సశేషం)

అన్నం పరబ్రహ్మస్వరూపంఅన్నారు పెద్దలు. ‘అన్నం వై ప్రాణ:’ అన్నది ఆర్యోక్తి. అనగా అన్నమే ప్రాణమని, భగవంతుని స్వరూపమని తెలియజేసి నారు. ‘యథా అన్నం తథాచిత్తంఅని కూడా ఉన్నది తినే అన్నాన్ని బట్టి చిత్తం(మనస్సు) ఉంటుంది. మనస్సును బట్టి వ్యవహారం నడవడిక, వ్యక్తిత్వం, ఆధారపడి ఉంటుంది. కావున రో జుల్లో మనం తలుకు-బెలుకు మిరిమిట్లుగొలిపే` కాంతు కొలిమిలో పడి, ఆకర్షణ` హంగు బొంకుకు లొంగిఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్, ప్యాకెట్ ఫుడ్, నూడ్సు, చైనీస్ఫుడ్ మసాల బిర్యాని, బేకరి ఐటీమ్స్కు బానిస మెతుకుకు అవాటుపడి లేని రోగాలను ఏరి`కోరికోరి మరీ తెచ్చుకుంటున్నాం. ఆధునిక జీవన శైలిలో పడి తామసిక ఆనందం పొందుతున్నాం. ప్రతి మనిషిలోసాత్విక` రాజపిక` తామసికగుణాలున్నట్లే మనం భుజించే పదార్థాలు కూడాసాత్వికత ` రాజపిక` తామసికంగాఉంటాయని తెలియజేయబడినాయి.
సాత్విక` ఆహారంఅనేది సంజీవనీ అస్త్రం అని తెలియజేయబడినది. మనం తీసుకొనే ఆహారంలోనే ఎన్నో ఔషధ గుణాల మేలు కలియిక ఉంటుందని ఆయర్వేద శాస్త్రం తెలియజేస్తుంది.
అన్నం హి భూతానాం జ్యేషంష్ట్ర్ఠమ్. సర్వోషధముచ్చతే!
అన్నాద్ భూతాని జాయంతే, జౌతాన్యన్నేన వర్ధంతే!!
అనగా ప్రాణిజగత్తులో అన్నమే ప్రధానమై నది. అన్నమే అన్నిరోగాలకు మందులాంటింది. అన్నం ద్వారానే ప్రాణాలుద్భవిస్తాయి, వృద్ధి చెందుతాయి. కనుక అత్యంత భారి` మసాలాలు` అధిక నూనే దినుసులు` నెయ్యి` వెన్నతో కూడిన ` వాడిన జిడ్డు పదార్థాల కొవ్వును పెంపొందించే ఆహారం పదార్థాలన్నీతామసిక ఆహారంఅని సూచిస్తాయని తెలియజేయబడినది. కొవ్వును కరిగించి కండు పెంపొందింపచేసేదే సాత్విక ఆహారం. సాత్విక ఆహారమే దీర్ఘ` ఆరోగ్య` రహస్య` సూత్రం. రాను`రాను సాత్విక ఆహారమేమిటో తొసుకుందా..        (సశేషం)

తాగే పదార్థాలతో ఏమేమి తినకూడదు
జీర్ణ` అజీర్ణప్రక్రియను సరిగ్గా అర్థం చేసుకొని మన నిత్యజీవితంలో తీసుకునే ఆహారం` ఆల్ప/ స్వల్పహారాలలో తగు జాగ్రత్త వహిస్తే కేవలం తిను` భండారాల ద్వారానే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీర సౌష్టవంగా` పటిష్ట` ఆకర్షణీయంగా మెలగగలమని తెలియజేయబడినది. ప్రస్తుతాంశం ద్రవపదార్థాముకు సంబంధించి నది. మన నిజజీవన వ్యవహారంలో అత్యంత ఖరీదైన విలాస ద్రవపదార్థాలు వాడటమనేది అంత ఆవశ్యకమేమియు కాదు, అవసరమూ కూడా లేదు. మనకు అందుబాటులో చౌకగా` సరళంగా` సహజంగా లభించే ద్రవపదార్థాల ద్వారా కూడా ఆరోగ్యకర మైన` స్ఫూర్తివంతమైన వ్యవహారం సాగించగలము, ఇదే సాత్విక వ్యవహారము. కేవలం మనకు  వాటి గురించి అవగాహన` ఆచరించాలనే ఆలోచన దృఢనిశ్చయం ఉంటే చాలను అనేక అనారోగ్యల సమస్య నుండి బయటపడగము. ద్రవపదార్థములో వేటిని` వేటితో మిశ్రమం చేయాలో` చేయకూడదో వీటిపై దృష్టి సారిద్దాం. పాలతోపాటు పెరుగు, ఉప్పు, చింత, కొబ్బెర, ఖర్బూజ (కస్తూరి కర్బూజా), మ్లుంగి, మ్లుంగి ఆకు, నూనే దినుసు, కుతీ, బియ్యపుపిండి, పుపున దించు పండ్లు మొన్నవి స్వీకరించకూడదనియు, తెలుస్తుంది. చల్లని నీటితో (శీతలపాని యంతో) వేరుసెనగపల్లీలు, పచ్చిపాప్కార్న్, జామ, పుచ్చపండు, నెయ్యి, వేడిపాలు, తేనీరు, వేడి పదార్థాలు, కీరా, జామున్ లాంటివి తీసుకోరాదని ఆరోగ్య సూత్రాలు తెలియజేస్తున్నాయి. కస్తూరి కర్బూజాపండుతోపాటు ముల్లింగి ఆకు, పాలు, పెరుగు, ఎల్లిపాయ (మ్లెల్లి) వాడరాదని తెలియజేయనగుచున్నది. సాధ్యమైనంతవరకు పాలు, మజ్జిగ, విరివిగా వాడటం అవాటుగా మారాలన్నది పెద్దల మాట చద్దిమూట. నాలుక రుచికన్న వాడుక సూచిమిన్నయని అంటుంటారు. మందు వాడుట కంటే ముందు జాగ్రత్త మేలని చెబుతుంటారు.  (సశేషం)