తగ్గుతున్న బాలికల సంఖ్యపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానిబ్రిటన్ నుండి వెలువడే ఇండిపెండెంట్ పత్రిక 2005 సం భారతదేశంలో ఒక సామాజిక సమస్య గురించి సర్వే నివేదిక ఇచ్చింది. నివేదిక ప్రకారము భారతదేశంలో గడిచిన రెండు దశాబ్దాలో ఒక కోటిమంది ఆడపిల్లలను పుట్టకముందే  పొట్టన  పెట్టుకొన్నారని వివరించింది. దేశంలో బాలబాలికల జనన నిష్పత్తులో బాలికల సంఖ్య ఏడాదికేడాది క్రమంగా పడిపోతోంది. 1991 నాటికి ప్రతి వెయ్యిమంది బాలురకు బాలికల సంఖ్య 945 ఉండగా 2001 నాటికి 927కి పడిపోయింది. 2011నాటికి 919కి పడిపోయింది. రాబోయే దశాబ్దాలో ఇది ఒక పెను సామాజిక సమస్యగా మారబోతోంది. భారతదేశంలో స్త్రీలను గౌరవించటము గురించి చాలా గొప్పగా  చెప్పుకొంటాము. వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. విషయాన్ని అందరూ ఆలోచించాలి. సామాజిక సమస్య పరిష్కారానికి అందరూ కృషి చేయవలసిన అవసరం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక నాగరికత పేరుతో పెట్రేగుతున్న విశృంఖత్వంను అదుపు చేయటానికి కృషి జరగవలసి ఉంది. భ్రూణ హత్యులు నిత్య కృత్యంగా మారిపోయాయి. 2013 మార్చిలో సర్వోచ్ఛ న్యాయస్థానము భ్రూణహత్యకు పాల్పడేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.  కాని పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న దారుణ పరిణామాం పట్ల ఆందోళనలు వ్యక్తమవు తున్నాయి కాని ఆచరణలో మార్పు రాకపోవటం శోచనీయం.  మగపిల్లవాడే వంశోద్ధారకుడన్న భావజాలాన్ని నరనరాన జీర్ణించుకొన్న భారతీయ సమాజంలో ఆడప్లి పట్టగ చిన్నచూపును పారద్రోలడానికి పెద్ద యెత్తున సామాజిక సంస్కరణోద్యమం సాగాలి. పుట్టేది ఆడప్లి అని తెలిసిన మరుక్షణం కన్నవాళ్ళే కసాయిుగా మారే మనోవైకల్యాన్ని మొదట సరిదిద్దాలి. ఆడపిల్ల తమకు రకంగానూ భారం కాదన్న ధీమాను పేద కుటుంబాలకు సమగ్ర బీమా పథకా ద్వారా ప్రభుత్వాలే కల్పించాలి. తల్లిదండ్రుల నుంచి మాత్రం ఆసరా లభించినా చదువు సంధ్య, పనిపాటు, వృత్తివ్యాపకాల్లో ఆడపిల్ల మగపిల్లడికన్నా ఎంతో మిన్నగా రాణిస్తారని ఏటికేడు రుజువవుతూనే ఉంది. ఎరుకనే తల్లిదండ్రుల్లో కలిగించి, ఆడబిడ్డల్ని కడుపులో దాచుకోవాల్సిన అవసరాన్ని తెలియజెప్పడంతో పాటు, గర్భస్థ పిండ పరీక్ష కేంద్రాల అక్రమ దందాపై ఉక్కుపాదం మోపినప్పుడే ` భరతజాతి సంస్కార భారతిగా నీరాజనాలందుకొంటుంది! విషయంలో అందరూ ఆలోచించి భవిష్యత్ ప్రమాదాలను నివారించుకోవటానికి కృషి చేయాలి. విషయాన్ని ఈదేశ ప్రధానిమన్కీబాత్లో వ్లెడించి సమస్యను మరోసారి అందరి దృష్టికి తీసుకొని వచ్చారు.