శత్రుభీకర భారతంజూన్ 9, త్లెవారు ఝామున భారత సైనికదళం వాయుమార్గంలో మయన్మార్, మణిపూర్ సరిహద్దులో తీవ్రవాద స్థావరాలపై విరుచుకుపడి సుమారు 25మందిని హతమార్చి, విధమైన నష్టం లేకుండా వెనుతిరిగాయి.  ఇదో మెరుపు దాడి. నిశ్చబ్ద యుద్ధం. 1971 యుద్ధంలో కూడా మన జవానులీ యుద్ధరీతిని ప్రదర్శించారు. ఒక రకంగా సరిహద్దు తీవ్రవాదం నెరపుతున్న పాకిస్థాన్‌కు ఇది ఒక హెచ్చరిక. నాగా తీవ్రవాదులు జూన్ మొదటివారంలో విరుచుకుపడి భారత జవాన్లను చంపిన దానికి ప్రతీకారంగా వైమానిక దాడి జరిగింది. మయన్మార్ చైనాపై పూర్తిగా ఆధారపడి వుంది. ఆయిల్, గ్యాస్, ఖనిజాలు వంటివి మయన్మార్‌లో పుష్కలంగా వున్నాయి. చైనా వాటిపై కన్నేసింది. చైనా కబంధ హస్తాల నుంచి భారత్‌వైపు మళ్ళేందుకు మయన్మార్‌కు గొప్ప అవకాశం దొరికింది. ఇది భారత రక్షణ చరిత్రలో నూతన అధ్యాయం. బర్మాలోకి చొచ్చుకొని పోయి భారత సైనికదళాలు చర్యను చేపట్టాయి.  ఈశాన్యంలోని ప్రాంతాలను దేశం నుండి విడగొట్టటానికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కప్లాంగ్ ముఠావారు గత కొన్ని ఏళ్ళుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.  ఇది పరోక్షంగా చైనాకు హెచ్చరిక  కూడా.  బర్మా ప్రభుత్వం, చైనా ప్రభుత్వం నొరెత్తలేదు.   1947 నుండి 1964 వరకు మనకు ప్రథానమంత్రిగా వుండిన జవహర్లాల్ నెహ్రూ  కాలంలో బర్మా మనకు మిత్రదేశంగా   దూరమయింది. చైనాకు దగ్గరయింది. అఖండ భారతంలో బర్మాను బ్రహ్మదేశమన్నారు. బర్మా గడ్డనుపయోగించి విచ్ఛిన్నకారులను భారత్‌పైకి ఉసి గొల్పేందుకు చైనా చేసే ప్రయత్నాలకు సైనిక చర్యతో గండి కొట్టినట్లైంది. ఇంతకాలం భారత ప్రభుత్వ మెతకవిధానానికి శ్రీ నరేంద్రమోడీ స్వస్తి చెప్పారు. తీవ్రవాద ముఠాలన్నీ క్రైస్తవ చర్చితో ప్రేరితమైనవి. ఈశాన్య రాష్ట్రాలో వనవాసీ ప్రజలను దశాబ్దాలుగా మతం మారుస్తూ భారత వ్యతిరేకతను నూరిపోస్తున్నారు. గత పదేళ్ళుగా వనవాసీ కల్యాణపరిషత్తు క్రైస్తవ కార్యకలాపాలకు సవాలు విసిరింది. వనవాసీ బంధువు కూడా హిందువులేనని అందరూ జాతీయజీవన స్రవంతిలో భాగమేనని చెప్పడంతో వనవాసుల్లో భావజాగరణ జరిగింది. భారత సైనికదళా చర్యతో యిప్పుడు విచ్ఛిన్నకారు గుండెల్లో భయం మొదయింది. శత్రువులకు భారతదేశం సింహస్వప్నం తలపించింది.