వైభవంగా పూర్తయిన గోదావరి పుష్కరాలు144 సంవత్సరాలకు ఒక సారి వచ్చే గోదావరి మహా పుష్కరాలు జూలై 14-25 వరకు  అత్యంత వైభవంగా పూర్తయినాయి. గోదావరి నది తెలంగాణలో కందకుర్తిలో ప్రారంభమయి గోదారి జిల్లాలోని (ఆంధ్రప్రదేశ్) అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది. కందకుర్తి నుండి అంతర్వేది వరకు గోదావరి తీరంవెంబడి భక్తులు పుష్కర స్నానా లు మనకు కనబడతాయి. మన ప్రజల సాంస్కృతిక ఏకతను చాటిచెప్పే ఇటు వంటి థార్మిక కార్యక్ర మాలే దేశ ప్రజలను కలిపి ఉంచుతాయి. సమయంలో అనేక ప్రముఖ దేవాలయాల ప్రదేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విశేషంగా జరిగాయి.
ఈసారి మహా పుష్కరాల సందర్భంగా గతంలో ఏన్నడూ లేనంతగా కోట్లాది మంది ప్రజలు పుష్కరం స్నానం చేశారు. సమయంలో అనేక మంది పీఠాధిపతులు ఆధ్యాత్మిక వేత్య ప్రవచనాలు ప్రజల్లో థార్మిక భావాలను జాగృతం చేశాయి.  సందర్భంగా రాజమండ్రిలో, ధర్మపురిలో జరిగిన గోదావరి హారతి కార్యక్రమంలో ప్రజల భక్తి పారవశ్యంతో పాల్గొన్నారు. పుష్కరాల కోసం దేశం అంతటి నుంచి, విదేశాల నుంచి కూడా భక్తులు రావటం ఒక పెద్ద విశేషం. గోదావరి తీరం వెంబడి ఉన్న కందకూర్తి, బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం, రాజమండ్రి, అంతర్వేదిలో ఉన్న పుణ్యక్షేత్రాలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
సమయంలో జూలై 14 తేది నాడు రాజమండ్రిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సరసంఘాచాలకులు మోహన్జీ భగవత్ రాజమండ్రిలో పుష్కర స్నానం ఆచరించి అక్కడే జరిగిన సంకల్ప సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నా రు. కార్యక్రమంలో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతీ స్వామిజీ, పరిపూర్ణనంద స్వామిజీ తదితరులు పాల్గొని మార్గదర్శనం చేశారు.