విజయం కోసం కష్టాలను వరంగా భావించిన దేవికా మాలిక్‌యువతీ మేలుకో...

యువతేజం దేవికా మాలిక్

విజయము కోరీ విసుగును వీడీ..

విరామమెరుగక పనిచేయాలీ...

అసాధ్యమనేది అసలే లేదని..

చరిత్ర నేర్పదే పవిత్రపాఠం..
చరిత్రలోని ఎందరో ధీశాలుర జీవిత చరిత్రను చదివిందేమో అమ్మాయి...విజయం సాధించాలంటే అంగవైకల్యంతో పనిలేదు విరామం లేకుండా కృషి చేస్తే చాలు అని అనుకుంది... అనుకున్న ట్లుగానే చరిత్రలో అసాధ్యాన్నింటినీ సాధ్యం చేస్తోంది.. పారా అథ్లెట్ గా యావత్ జాతి గర్వించ దగిన రీతిలో దూసుకుపోతోంది.. దేవికా మాలిక్.
ఆమె శరీరంలోని ఎడమ భాగం పూర్తిగా అచేతనంగా మారింది. అరుదైన హెమీప్లేజియా అనే వ్యాధితో బాధపడుతోంది.. అయితేనేం అంతర్జాతీయ పోటీల్లో తనదైన ముద్రతో, ‘‘కామన్వెల్త్ యూత్ స్పోర్ట్స్ అండ్ పీస్ వర్కింగ్ గ్రూప్ కి మన దేశ ప్రతినిథిగా వ్యవహరిస్తోంది...ఇటీవలే దేశ ప్రతిష్టతను మరింత ఇనుమడిపంచేసే విధంగా బ్రిటన్ యువరాణి చేతుల మీదుగా ‘‘క్వీన్స్ యంగ్ లీడర్ అవార్డును అందుకుంది.
దేవికా మాలిక్ తల్లి దీపా మాలిక్ కూడా పారా ఒలింపిక్స్ అథ్లెట్.. తన తల్లి స్ఫూర్తితోనే  ఉన్నత స్థాయికి రాగలిగానని చెబుతోంది అమ్మా యి. ఆమెకు ఒకటిన్నర ఏళ్లు ఉన్నప్పుడే హెమీ ప్లెజియా వ్యాధి ఉందని నిర్థారణ అయింది. కుడి శరీర భాగంతో పోలుచుకుంటే, ఎడమ శరీర భాగం 50 శాతం బలహీనమైనదిగా ఉంటుంది. దాదాపు శరీర భాగాన్ని అచేతనంగా ఉండిపోతుంది. కొన్ని సార్లు ఆమె పనులు కూడా ఆమె చేసుకోవడం కష్టతరంగా ఉండేదట. అలాంటి సమయంలో ఆమెలో కలిగే ప్రతికూల భావనల్ని అనుకూలంగా మార్చేసుకుంది. ఆమె తల్లి ప్రోద్భంతో 2010 సంవత్సరంలో పారా అథ్లెట్ క్రీడారంగంలోకి ప్రవేశించింది. ముందుగా రజత పతకంతో ప్రారంభమైన ఆమె క్రీడారంగ కెరీర్ తర్వాతి సంవత్సరాలో ఐదు బంగారు పతకాలను సాధించేదాక సాగింది. క్రీడల్లో పాల్గొంటూనే సంస్థలో మేనేజ్ మెంట్ అసోసియేట్గా పనిచేసింది. కేవలం ఆటలేకాక ఆమె తల్లితో కలిసి ‘‘వీలింగ్ హ్యాపీనెస్అనే సంస్థను వికలాంగుల కోసం స్థాపించింది.
ప్రపంచంలోనే వ్యక్తి పుట్టగానే సాహసాలు చేయడు. మనకున్న శక్తి యుక్తులతోనే మనల్ని మనం మార్చుకోవాలి. మనలో ఉండే లోపాల కంటే బలాల గురించే ఎక్కువగా ఆలోచించాలి. నేను వికలాంగురాలినీ, నేను ఏమీ చేయలేను అనుకునే బదులు నేను దేన్నయినా అధిగమించగను అని అనుకుంటే, విజయం కోసం ఎలాంటి కష్టాన్నయినా భరిస్తూ దానికై ప్రయత్నం చేస్తే తప్పకుండా రంగంలో అయినా విజయం సాధించవచ్చుననిచెబుతోంది యువతేజం.
-లతా కమలం