సమాజాన్ని సంఘటిత పరచటమే లక్ష్యం

హితవచనం
వ్యవస్థ, నియమాలు సమాజం కోసమే. వ్యవస్థలలోను, నియమాలలోను మహత్వం లేదు. సంఘటనలోనూ, దాని జీవనంలోనూ మాత్రమే ఉంటుంది. సంఘం కోసం హద్దులేర్పరచటం అవసరమయింది అనుకో, అప్పుడు శ్రీరాముడిలా ప్రతిజ్ఞ పూనాలి. నియమాలు ఉల్లంఘించటం అవసరమయ్యింది అనుకో, అప్పుడు శ్రీకృష్ణుడిలా వ్యవహరించాలి. ఉల్లంఘించడమూ, పాలించటమూ - ఈ రెండింటి మాటునా సమాజాన్ని సంఘటిత పరచాలన్న అభిలాషే ఉన్నది. వ్యవస్థా, నియమాలూ - ఇవి సాధనాలు మాత్రమే. కాని సాధ్యాలు కావు. సాధ్యాన్ని పొందటానికి సహాయపడినంతవరకే సాధనాల ప్రయోజనం. ఊరికే మూఢంగా అనుసరించటం వల్ల లాభం ఏమిటి?
జగద్గురు శంకరాచార్య