ఆర్యులు - ద్రావిడులు అందరూ హిందువులేభారతదేశం ఒక దేశమే కాదనీ, ఒక ఉపఖండమనీ, ఆర్యులు ద్రావిడులను తరిమికొట్టారనీ, ఉత్తర-దక్షిణ భారతీయులు రెండు వేర్వేరు జాతులనీ, ఇలా ఎన్నో ప్రచారాలు చేశారు పాశ్చాత్యులు. మన పాఠశాలల్లో, కళాశాలల్లో బోధించే 'చరిత్ర' కూడా దాదాపుగా ఇలాగే ఉండటం దురదృష్టకరం. డాక్టర్ ఐరావతం మహాదేవన్ ప్రముఖ "ఎపిగ్రాఫిస్ట్" అనగా ప్రాచీన లిపి శాస్త్రజ్ఞుడు కుప్పం విశ్వవిద్యాలయం నుండి డి-లిట్ పట్టాపొందిన విద్యావంతుడు. ఈయన 'ఆర్య-ద్రావిడ-విజాతి సిద్ధాంతం' గురించి లోతుగా శాస్త్రీయంగా పరిశోధన చేసి ఫలితాలు వెల్లడించారు. ఆయన చెప్పినదాని ప్రకారం 'ఆర్య-ద్రావిడ' అనేవి వేరు వేరు జాతులు కాదు, అవి రెండు భాషలు మాత్రమే. ఉత్తర భారతం నుండి దక్షిణ భారతానికి వచ్చిన అగస్త్య మహాముని గురించి పరిశోధన చేశారు, దక్షిణ భారత భాష అయిన తమిళ సాహిత్యంలో ఉత్తరం నుండి దక్షిణానికి వచ్చిన జ్ఞాని అగస్త్యన్ అని ప్రస్తావన ఉన్నది. ఎక్కడా ద్వేషభావం లేదు. సింధూ నాగరికత కూడా పరిశోధించిన మహాదేవన్ ఇంకా ఇలా అంటున్నారు -'ఆర్యులు, ద్రావిడులు భారతదేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వా'నికి ప్రతీక. కాని ఇవి రెండు జాతులు కాదు' అని చెప్పారు.

ఇతర రాష్ట్రాలు కూడా ఈ దిశలో ఆలోచించాలి. ఎంతైనా మనది హిందూదేశం కదా!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అన్నది అరువది సంవత్సరాల స్వప్నం. ఉద్యమాన్ని నిర్వహించిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ నాయకుడే కాకుండా ఒక గొప్పదైవభక్తుడు కూడా. రాష్ట్రం సిద్ధించాలని ఆయన వివిధ దేవతలకు మ్రొక్కుకున్నారు. తెలంగాణా ఆవిర్భావం సాకారం అయినందువల్ల మ్రొక్కులు తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నది కొత్త ప్రభుత్వం. వెంకటేశ్వరస్వామికి అయిదు కోట్లు విలువచేసే 'కమలం', 'సాలగ్రామం' చేయిస్తున్నారు. పద్మావతీ, కనకదుర్గ అమ్మవార్లకు ముక్కుపుడకలు, భద్రకాళి అమ్మవారికి కిరీటం, వీరభద్రస్వామికి బంగారు మీసాలు చేయించేపనిలో ఉన్నారు. ఈ చర్యను కొంతమంది విమర్శిస్తే విమర్శించుదురు గాక! కాని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇతర రాష్ట్రాలు కూడా ఈ దిశలో ఆలోచించాలి. ఎంతైనా మనది హిందూదేశం కదా!