భగవంతునిపై భక్తి ఉంటే చాలు...!

హితవచనం

నారదుని భక్తిసూత్రాలలో మొదటిది ‘‘అథా తోభక్తిం వ్యాఖ్యాస్యామఃదీని భావాన్ని జాగ్ర త్తగా గమనించినట్లైతే ‘‘ విషయమైనా మన మనస్సులోకి రావాంటే 1) విషయాన్ని తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక, 2) విష యాన్ని గ్రహించగలిగితే మానసికత, 3) దానికి అనుకూల పరిస్థితులు ఉండాలి. కోరిక ఉన్నంత మాత్రాన ఫలం లేదు. అది తీవ్రంగా ఉండాలి. దానికితోడు గ్రహణశక్తి ఉండాలి. రెండూ ఉన్నా పరిస్థితితులు ప్రతి కూలంగా ఉంటే పని ముందుకుపోదు. ఆటంకాలు ఎదురౌతుం టాయి. పై మూడూ ఉన్నా శ్రద్ధ లేకపోతే ఫలితం సాధించలేముఅని నారదుడు చెప్పాడు. అక్షర జ్ఞానం లేకున్నా, ఎట్టి చదువు చదవకున్నా, భగవంతుడి యెడల భక్తిభావంతో జీవన సాఫ్యంల్యం పొందినవారు అనేకులు. మహాత్ములు కబీరు, నానక్, తుకారం మున్నగువారే దీనికి నిదర్శనము. భగవంతుని యెడల భక్తిభావం, మన సిద్ధాంతం యెడల శ్రద్ధ ఉన్నట్లయితే అద్భుతాలు సాధించవచ్చు.