నోట్ల కట్టపై కూడా ఏసు మతప్రచారంమనిషి సంఘజీవి. ఏ దేశంలోనైనా ప్రజలందరూ ఒక ధర్మానికి, నీతికి కట్టుబడి ఉండాలి. ధర్మం, నీతి తరువాత సమాజం కట్టుబడవలసినది చట్టానికి. చట్టంలోని నియమనిబంధనలకు అందరూ విధేయులే. చట్టానికెవ్వరూ అతీతులు కారు. కరెన్సీ నోట్లు అనగా మనం ఉపయోగించే 'డబ్బు' విషయంలో పాటించవలసిన కొన్ని ఖచ్చితమైన నియమాలను భారత రిజర్వ్ బ్యాంకు నిర్దేశించింది. వీటిని భారత రిజర్వ్ బ్యాంకు 'వెబ్ సైటు'లో మనం చూడవచ్చు. కొన్ని నియమాలు ఈ విధంగా ఉన్నాయి.
భారత రిజర్వ్ బ్యాంకు నిబంధనలు - 2009, పేరా(సి), పేరా(జి) చూడండి.
పేరా-సి : కరెన్సీ నోటుపై వ్రాయటం, గీయడం, ఏదో ఒక వ్యక్తి-సమూహానికి ప్రయోజనం కలిగే విధంగా ముద్రలు వేయటం చట్టవిరుద్ధం.
పేరా-జి : 1) నోట్ల కట్టకు పిన్ను కొట్టరాదు, 2) వ్రాయరాదు, రబ్బరు స్టాంపు కొట్టరాదు, గుర్తులు పెట్టరాదు. ఇవన్నీ చట్టవిరుద్ధం. 3) కరెన్సీ నోట్లను అలంకరణకు వాడరాదు. నోట్లతో హారాలు చేయరాదు. వ్యక్తుల సన్మానంలో నోట్లు కురిపించరాదు.
నియమాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ క్రైస్తవ మత ప్రచారకులు నోట్ల మీద 'రబ్బరు స్టాంపులు' కొట్టి, చేతితో నినాదాలు వ్రాసిన నోట్లను ప్రజలకు పంచి మతప్రచారానికి పాల్పడుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలో ఇటువంటిదే రూ.500 నోట్ ఒకటి బయటపడింది. (నెంబరు 6BC 470276).  ఈ ఐదువందల రూపాయల నోటుమీద 'Jesus Loves U, Jesus Saves you' అని రబ్బరుస్టాంపు కొట్టబడింది. ఒక ప్రముఖ తెలుగు వారపత్రిక సంపాదకునికి కూడా ఎవరో వందనోటు ఇచ్చారు. దానిమీద 'జీసస్' గురించి చేతితో వ్రాసిన పదాలున్నాయి.
చట్టం ప్రకారం ఇలా చేయటం నేరం కదా? మరి ప్రభుత్వం వీరిమీద చర్య తీసుకుంటుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇంకొక విషయం - అనైతికంగా, చట్టవిరుద్ధమైన చర్యల ద్వారా మతప్రచారం చేయటం కూడా నేరమే!
మరి ప్రభుత్వం చట్టాన్ని రక్షిస్తుందా? లేక చేష్టలుడిగి చూస్తూ ఊరుకుంటుందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
- ధర్మపాలుడు