సామాజిక చైతన్యాన్నికి ప్రతీక బోనాల పండుగఆషాఢమాసం వచ్చింది..! ఇక అమ్మల గన్న అమ్మ..., ముగ్గురమ్మల మూలపుటమ్మకు బోనం సమర్పించే సమయం ఆసన్నమయింది...! ఇంకేం భాగ్యనగరం అంతటా సందడే సందడి...! వైపు బోనాల ఊరేగింపు..! మరోవైపు డప్పు దరువు...! ఇంకొవైపు పోతరాజుల వీరంగం...! శివసత్తుల ఆటలు....! సకలజను పాటలు...! గోల్కండ ఖిల్లా నుంచి సికింద్రాబాద్ లష్కర్.., పాత బస్తీ వరకు  బోనాల జాతరలో ఇక తీన్మారే...! ఆషాఢం రావడంతోనే ప్రకృతి పులకరించింది...! పచ్చదనం వచ్చింది...! ఒక్కో ఆదివారం ఒక్కో ఏరియాలో జాతరే జాతర..!
ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం .. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో బోనాల  హడావిడి మొదలవుతుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రతి ఇంటా అమ్మోరికి బోనం లేస్తది...! చల్లని తల్లికి నైవేద్యం పెట్టేందుకు.. ఇల్లాళ్లు.. కన్నెపిల్లలు, ఇలా ఒకరేమిటీ వయోలింగ బేధం లేకుండా అమ్మవారి గుడుకు తరలివెళ్తారు. మొదటగా గోల్కొండ (ఎల్లమ్మ) జగదాంబిక అమ్మవారి ఆలయంలో పండుగ జరుపుకోవడం ఆచారం. ఇక్కడ బోనాల సమర్పణ జరిగాకే... దశలవారీగా తెలంగాణలోని మొత్తం పది జిల్లాల్లో బోనాల జాతరలు జరుగుతాయి.
గోల్కొండలో ప్రారంభమైన బోనాల  సంబురాలు తర్వాతే వచ్చే ఆదివారం రోజున సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి ఆయా ఏరియాలోని ప్రజలు బోనాలు సమర్పి స్తారు. అనంతరం... తరువాత వచ్చే  ఆదివారం రోజున చార్మినార్, లాల్ దర్వాజా, కార్వాన్ అమ్మవారితో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్లలోని మిగిలిన అన్ని అమ్మవార్ల ఆలయాలో ప్రజలు ఎంతో  వైభవంగా బోనాలు సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
గోల్కండ కోటలో బోనాలు ప్రారంభించే సంప్ర దాయం మహమ్మద్ కులీకుతుబ్షా కాలం నుండే ప్రభుత్వ పరంగా జరపుతూ వస్తున్నారు.  బోనం అంటే అన్నం...! దేవత కోసం నైవేద్యంగా వండు కొని.., అమ్మవారికి సమర్పించడానికి కుండలో తీసుకెళ్తారు. దీనిని  బోనం కుండ అంటారు. కుమ్మరి ఇంటి నుండి కొత్తకుండ తెచ్చిన తర్వాతే బోనం వంట చేస్తారు. తర్వాత వండిన కుండకు అడుగు , మూతికి సున్నం పూసి, నూనె రాసి పసుపు, కుంకుమతో గుండ్రంగా బొట్లు పెడతరు. తర్వాత దానిని ఇంటిలోని ఒక ముత్తైదువు తలపై ఎత్తుకొని అమ్మవారి సన్నిధికి తీసుకొనిపోయి నైవేద్యం సమర్పిస్తారు.
అయితే  ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకున్న మాతృమూర్తులు బయుదేరి ఒకచోట కలుసుకొని... డప్పు చప్ప్లులతో పోతరాజు విన్యాసాలతో దేవత దగ్గరకు ఊరేగింపుగా వెళ్లడం సంప్రదాయం.  బోనం కుండన్నీ దేవతకు నైవేద్యంగా సమర్పించి ఇంటికి వచ్చిన పిమ్మట ఇంటిల్లి పాది బోనం కుండలోని అన్నాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు
ఆషాఢ మాసమంతా ప్రతి ఆదివారం ఆయా ప్రాంతంలో జరిగే అమ్మవారి బోనాల ఉత్సవాలో బోనాలు, ఫలారం బండ్ల ఊరేగింపు, రంగురంగులతో అంకరించిన తొట్టెతో, రంగం, ఘటాల ఊరేగింపుతో పోతరాజు విన్యాసాలతో గ్రామాలతోపాటు, భాగ్యనగరమంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. గండి మైసమ్మ, ఆరె మైసమ్మ, కోట మైసమ్మ, కట్ట మైసమ్మ మొదలైన పేర్లతో ఉన్న అమ్మవార్లందరికీ పూజలు జరుపుతారు. యావత్ తెలంగాణకే పండుగ ప్రత్యేకం... తెంగాణలోని హిందువుందరూ కులాలకు అతీతంగా కలిసి మెలిసి జాతరను  జరుపుకొంటారు. ఇది హిందు బంధువులందరిలో ఐక్యమత్యం చాటే పండుగ...!