ఆరోగ్యంగా ఉండటానికి వీటిపై దృష్టి సారించండి

మన శరీరమెప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని అత్యంత అవసరమైన వాటిని అనుసరించదగు అంశాలను గమనిద్దాం. మన ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, ఆలోచనాధోరణి ప్రవర్తన సరళీపై ఎల్లప్పుడు నియంత్రించుకోవటంలో దృష్టి పెట్టాలి. జీవితంలో వీటన్నింటిని నియంత్రించని యెడల నిశ్చితముగా మనం ఆనారోగ్యం పాలవ్వక తప్పదని శరీర ధర్మం చెబుతుంది. అందుకనే ఈసారి పాఠకుల కొరకు కొన్ని చిట్కాలు తెలియజేయడం జరుగుచున్నది. తద్వారా వారు గనుక నిత్యజీవితంలో ఆచరించినచో అనేక సమస్యలతో సతమతమౌతున్నవారికి సుగమమైన సత్ఫలితాలు సంప్రాప్తిస్తాయని సూచించడం జరుగుచున్నది.

  • నిమ్మరసం వాడుటచే ` జలముత ద్వారా పాప్తగు (ప్రాకృత రోగాలు, టైఫాయిడ్, జలుబు, పొట్ట (కడుపునొప్పి) అజీర్తి) వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది.
  •   చక్కి`చేతితో తయారు చేసిన పిండిని వాడితే శరీరంలో రోగ నిరోధకశక్తి పెరుగును, అంకరే ఎల్లప్పుడు గోధుమను పిండి గిర్నీలో వేయించాలి. చాలా రోజుల ముందు తయారైన పిండిని వాడకుండుటే మేలు.
  • పండ్లు, తీపి`మిఠాయి, నెయ్యి లేదా నూనెతో తయారైన పదార్ధాలు తిన్న వెంటనే నీళ్ళు త్రాగరాదు.
  • భోజనం వండిన దాదాపు గంట లోపలే భుజించవలెను. తరువాత భుజించినచో పోషక విలువలు తగ్గుతాయి. 12 గంటల తరువాత ఉన్న ఆహార పదార్ధాలు పశువులకు కూడా తినడానికి ఉపయోగకరంగా ఉండవు.
  •  14 సంరలోపు పిల్లలకు ఎప్పటికి కూడా మైదాతో తయారైన తినుభండారాలు (బిస్కేట్స్, బ్రెడ్, సమోసా, మ్యాగి, కచోరి మొ) తినిపించవద్దు.
  • భోజనానికి సైంధవ ఉప్పు సర్వశ్రేష్టమైనదని, దాని తరువాత నల్లటి ఉప్పును వాడాలని, శ్వేత ఉప్పు (తెల్లటి ఉప్పు) సాధ్యమైనంత వరకు వాడవద్దు.
  •  కూరల్లో ఎప్పటికి  పై నుండి ఉప్పును జల్లరాదు.
  •   తీపి కొరకు మిశ్రీ, బెల్లం, తేనె, జాతీయమైన బూరా, మొగు వాటిని వాడుట మంచిది. పంచదార (చెక్కర) వాడకం విషం లాంటిది అనేది నానుడి.
  • టూథ్పేస్ట్, బ్రెష్ వాడుక స్థానంలో సాధ్యమైనంతవరకు దందపుల్లలు లేదా మంజన్ వాడుట మూలాన దంతాలు శక్తివంతమౌతాయని ఆరోగ్య సూత్రం ఆరోగ్యంగా ఉండడానికి మంచి నిద్ర, స్వచ్ఛమైన, సాత్వికమైన తాజా భోజనం, అవసరమేరకు నీటిని త్రాగడం అత్యంతావశ్యకం.
  • రాత్రుల్లో అధిక సమయం వరకు మేలుకుండుటంతో రోగ నిరోధక శక్తి తగ్గునని, భోజనం కూడా సరియైన రీతిలో అరగదు`మలబద్ధక సమస్య పెరుగుతుంది. కంటి సమస్యలుత్పన్నమౌతాయని ఆరోగ్య సూత్రాలు ఉటంకిస్తున్నాయి.