దేశ విభజన సమసి పోవాలిప్రాచీన భారతంలోని ప్రభుత్వ వ్యవస్థ ప్రజల జీవితావసారాల ననుసరించి వికసించింది` అందులో అందరికీ, అన్ని అవసరాలకీ స్థానముండేది. ప్రభుత్వంలో రాజుకు, ప్రభువుకు, ప్రజలకు` ప్రాతినధ్యముండేది. యూరప్లోనూ పాశ్చాత్య దేశాలోనూ వ్యవస్థ కేవలం మేధాజనితం, అంతా హేతువాదబద్ధం. అన్నీ ఒక క్రమబద్ధంగా ఉండాలని చూచారే గాని అందులో స్వేచ్ఛకీ, వైవిధ్యానికీ తావు కల్పిం చలేదు. ప్రజాస్వామ్య మంటే` ప్రజాస్వామ్యానికేగాక ఇంక దేనికీ స్థానం లేదు. సమయానుకూల మార్పుకి తావులేదు. భారతదేశమిప్పుడు పాశ్చాత్యుని అను కరింపబోతోంది. పార్లమెంటరీ వ్యవస్థ భారత దేశానికి నప్పదు. కాని, పాశ్చాత్యు లు విడనాడిన వాటినే మనమిప్పుడూ తీసుకుంటున్నాము.
అన్నింటకంటె ప్రధానంగా ఒక రాష్ట్రపతి ఉండాలి. ఆయనకి విస్తృతమైన అధికారముం డాలి` విధానాలు నిరాటం కంగా కొనసాగటా నికి. దేశానికి ప్రాతినిథ్యం వహించటా నికి ఒక శాసనసభ ఉండాలి. రాష్ట్రాన్నీ ఒక ఫెడరేషన్ గా ఏర్పడి కేంద్రం వద్ద సంయుక్తంగా ఉండాలి. స్థానిక సంస్థకు తమతమ సమస్యని తమకి తోచిన రీతిన పరిష్కరించుకోవటానికి అవకాశమివ్వాలి.
- యోగి అరవింద మహర్షి