భారతదేశానికి ప్రజాస్వామ్యం అంటే
తెలియదని కాదు. రాజరి కాలున్న కాంలో
కూడా భారత
దేశంలో గణతంత్ర
రాజ్యాలున్నా యి. అప్పట్లో పూర్తిస్థాయి ప్రజా
స్వామ్యం ఉండేదని చెప్పటం లేదు. కాకపోతే
భారతదేశానికి పార్లమెంట్లుగానీ, పార్లమెంటరీ
సంప్రదాయాలు గానీ కొత్త కాదు. బౌద్ధ
భిక్ష సంఘాలపై
జరిగిన అధ్యయనాలలో..
నేటి ఆధునిక
ప్రపంచానికి తెలిసిన పార్లమెంటరీ సంప్రదాయాలను ఆ
నాటి సంఘాల్లో
పాటించే వారని
చెబుతున్నాయి. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థను భారతదేశం
కోల్పోయింది. ఇప్పుడు
మళ్లీ కోల్పోతుందా?
నాకు తెలియదు.
భారత్
వంటి దేశంలో
ఇది సాధ్యమే.
చాలా కాలంగా
ప్రజాస్వామ్యం అమల్లో లేదు. ఇపుడు కొత్తగా
ఉంటుంది. నియంతృత్వానికి దారిఇచ్చే
అవకాశం
కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంది.
ప్రజాస్వామ్యం తన రూపాన్ని అలాగే ఉంచుకుని
దానిలోనే నియంతృ త్వానికి కూడా అవకాశం
కల్పిస్తుంది. జాగరూకతతో ఉండటం అవసరం.
డా॥ బి.ఆర్.అంబేద్కర్