కుటుంబ స్వామ్యంతో సతమతమవుతున్న కాంగ్రెస్‌

దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టం కావాలంటే అధికారపక్షము-ప్రతిపక్షం బాధ్యత యుతంగా వ్యవహరించాలి. పాలన సక్రమంగా నడవటంలో ఇద్దరిదీ కీలక పాత్రే, అట్లా ప్రజాస్వామ్యంపై విశ్వాసం పాలనకు మూలాధారం. ప్రజాస్వామ్యం పార్టీలో కూడా ఉండాలి.