బాబ్రీ కట్టడం స్థలంలో హిందూ ఆలయం

అయోధ్యలో బాబ్రీ కట్టడం ఉండిన స్థలంలో 1976-77 మధ్య కాలంలో అప్పటి భారత పురాతత్వ శాఖ (ఎఎస్) డైరెక్టర్ ప్రొఫెసర్ బిబి లాల్ నేతృత్వంలోని బృందం జరిపిన తవ్వకాల్లో ఒక హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలు బైటపడ్డాయని అప్పుడు ఎఎస్ ఉత్తరాది  ప్రాంతీయ డైరెక్టర్గా పనిచేసిన కెకె మహమ్మద్ వెళ్ళడించారు. అంతేకాదు, బాబ్రీ కట్టడం సమస్యకు సామరస్య పరిష్కారం లభించే అవకాశాలకు ఇర్ఫాన్ హాబీమ్, రోమిల్లా థాపర్లాంటి వామపక్ష భావజాలం ఉన్న చరిత్రకారులు గండికొట్టారని నాన్ ఎన్న భారతీయం (నేను నా భారతీయం) పేరుతో మళయాళంలో రాసుకున్న ఆత్మకథలో మహమ్మద్ చెప్పారని ఆన్లైన్ పత్రిక ఫస్ట్పోస్ట్ పేర్కొంది. వామపక్ష చరిత్రకారులు జరిపిన బ్రెయిన్వాష్ ప్రభావానికి ముస్లిం మేధావులు గనుక లొంగిపోకుండా ఉండి ఉంటే బాబ్రీ కట్టడం సమస్య ఎప్పుడో పరిష్కారం అయి ఉండేది. 19 శతాబ్దానికి ముందు అక్కడ ఉండిన రామాలయాన్ని కూల్చివే యడం గురించి ఎక్కడా ప్రస్తావన లేదని, అయోధ్య బౌద్ధు, జైన్ కేంద్రమని రోమిల్లా థాపర్, బిపిన్చంద్ర, ఎస్ గోపాల్ సహా కొంతమంది చరిత్ర కారులు వాదించారు. ఇర్ఫాన్ హబీబ్, ఆర్ఎస్ శర్మడిఎన్ ఝూ, సూరజ్బెన్ అఖ్తర్ అలీ లాంటి చరిత్రకారులు సైతం దీన్ని సమర్థించారు అని ముహమ్మద్ ఫస్ట్పోస్ట్కు చెప్పారు. అంతేకాదు తవ్వకాల సమయంలో బయటపడిన ఆలయ స్తంభాలను బట్టి బాబ్రీ కట్టడం చోట ఒక హిందూ ఆలయం ఉండేదని స్పష్టం అవుతోందని కూడా ముహమ్మద్ వాదించారు. అక్కడ ఒకటి, రెండు కాదు.. ఏకంగా 14 స్తంభాలను కనుగొన్నాం. 11,12 శతబ్దాలకు చెందిన ఆలయ స్తంభాలను పోలిన స్తంభాలను బట్టి చూస్తే ఆలయం శిథిలాలపైన బాబ్రీ కట్టడంను కట్టారని స్పష్టమవుతోంది. విషయమై నేను అప్పట్లోనే చాలా ఇంగ్లీషు దినపత్రికలకు వ్యాసాలు పంపించాను. ఒక్క పత్రిక మాత్రమే అది కూడా లెటర్స్ టు ది ఎడిటర్ కాలమ్లో నా అభిప్రాయాన్ని ప్రచురించింది అని ముహమ్మద్ పుస్తకంలో రాశారు. వామపక్ష చరిత్రకారులు అలహాబాద్ హైకోర్టును సైతం తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించడమే కాకుండా చివరికి కుతుబ్ మినార్, తాజ్మహల్ సైతం హిందూ ఆలయాలపైన నిర్మించినవేనని అన్నారు. 2012లో ఎఎస్ లో రిటైరయిన తర్వాత మహమ్మద్ హైదరాబాద్లోని ఆగాఖాన్ ట్రస్టు ప్రాజెక్టు డైరెక్టర్గా పని చేస్తున్నారు.