మాతృనరకోభవ- పితృచంపోభవమీరు సరిగానే చదివారు` ఇది అచ్చుతప్పు కాదు. మనమేమో తూర్పుకి తిరిగి దండం పెడతాం. ‘వారేమోపడమరకి తిరిగి దండం పెడతారు. మనం ఎడమనుండి వ్రాస్తే వారు కుడి నుండి వ్రాస్తారు. అంతవరకూ బాగానే ఉంది. మనం మాతృదేవోభవ పితృదేవో భవ అంటాం కదా! మరి వారేమంటున్నారో తెలుసా? నసీర్, 12 సంవత్సరాల బాలుడు. సిరియాలో ఆత్మాహుతిదళంలో శిక్షణ పొందుతున్నాడు. వీడితోపాటుగా 60మంది ఇతర బాలురు కూడా శిక్షణ పొందుతున్నారు. వీరిలో కొందరి వయస్సు కేవలం 5 సంవత్సరాలు. వీరికి శిక్షణ ఇచ్చే కమాండర్లు పిల్లలకు ఇలా చెపుతున్నారు. ‘పిల్లలూ మీరు మీ మీ ఇళ్ళకి వెళ్ళి మీ తల్లిదండ్రులను తుపాకీతో కాల్చి చంపండి` ఇదే మీరు చేసే మొదటి పవిత్ర యుద్ధంఇదే విషయాన్ని ఈఎన్ఎన్ సంస్థకి నసీర్ చెప్పాడు.