ముఖకేశాలు ఆరోగ్యకరంగడ్డం మాసినా` మీసాలు గుబురుగా పెరిగినా ఇక చింతించవసిన అవసరం లేదు. హాయిగా గడ్డం పెంచుకోండి మీసాలు మెలివెయ్యండి` ఇబ్బంది లేదు. ఎందుకంటారా? మూతిపైనా చెంప పైనా మొలిచే వెంట్రుకలో సూక్ష్మజీవుల ఆవాసం ఏర్పరుచుకుంటాయి. కానీ సూక్ష్మజీవులు మనకు వచ్చే కొన్ని అనారోగ్యకరమైన బాక్టీరియాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. యాంటీ బయోటిక్గా పనిచేస్తాయి. ఇటీవల కొందరు పాశ్చాత్య శాస్త్రవేత్తలు 408 మంది పురుషులపై ఒక అధ్యయనం చేశారు. నున్నగా గడ్డం గీసుకున్నవారికి త్వరగా అంటురోగాలు తగులుతున్నాయి, అదే సమయంలో గడ్డం మీసం ఉన్నవారికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. మన రుషులు మునులు అందరూ గడ్డాలవారేగా!