అమరవాణి

ఆతురే నియమో నాస్తి
బాలే వృద్ధే తథైవచ
సదాచారరతే చైవ:
ఏష ధర్మ: సనాతన:
అనగా: రోగగ్రస్తునకు, బాలునకు, ముసలివారికి, సదాచారునకు, కఠిన నియమము అక్కర లేదు. ఇట్టి ధర్మము పూర్వకాలము నుండి వచ్చుచున్నది. ధార్మిక నియమ నిబంధనలో పైవారికి సడలింపు ధర్మమే కల్పించినది.