దేశంలో మార్పు రావాలంటే మానసిక విప్లవం రావాలి: హితవచనంమన యొక్క లక్ష్యము జాతిని పునర్నిర్మించటం. లక్ష్య సాధనకు ఎన్నికకు (రాజకీయము) ఒకమేరకు ఉపయోగపడతాయి. అవే సర్వస్వం కాదు.
1) ప్రజలకు మనం మార్గదర్శనము చేయాలా? లేక ప్రజలు తమకు ఇష్టమైన రీతిలో నడవాలా? అనేది ఆలోచించుకోవాలి.
2) రాజకీయ వాది ఎప్పుడు రానున్న ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. జాతి నిర్మాత రానున్న తరం గురించి ఆలోచిస్తాడు.
3) క్యాపిటలిజం, సోషలిజం, కమ్యూనిజం, అనార్కిజం మొదలైనవి ఒకదానికొకటి విరుద్ధంగా కన్పించినా వీటన్నింటికీ మూలధారమైన భూమిక ఒకటే ఉన్నది. సాంఘిక, ఆర్థిక వ్యవస్థలు మారిస్తే మనష్యుల మనస్సులు మారతాయి అని వారు చెబుతారు కాబట్టి భౌతిక విప్లవం రావాలి. రాజకీయ విప్లవంగా మారాలి. విప్లవాదుల  రాజ్యం రావాలి. పరిస్థితులు మారాలి. అప్పుడు మనుష్యులు మారతారు అని వారి వాదన. కాని చైనా, రష్యా విప్లవాలు చూస్తే ఇది తప్పని రుజువయినది. మన భారతీయు వ్యక్తి సంస్కారాలకు ప్రాధాన్యత ఇచ్చారు, మనష్యుల మనస్సు సంస్కారవంతంగా ఉన్నట్లయితే వ్యవస్థను మార్చుకోవచ్చు కాబట్టి మనుష్యుల మనస్సులో విప్లవం తీసుకొని రావ టానికి రాజకీయవాదులు పనిచేస్తారా? రాజకీయ వాదులు అధికారం కోసం తాపత్రయపడటమే సరిపోతుంది. అధికారంలోనికి వస్తే సర్వం సాధించగలమని చెబుతుంటారు మాటలో సత్యం లేదు.  సాంఫీుకి, ఆర్థిక, రాజకీయ విప్లవాలు రావాలంటే మనుష్యుల మనస్సులో విప్లవం తీసుకొని రావాలి. కాబట్టి మనుష్యులను సంస్కారవంతులుగా చేయటానికి నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు  చేయటం అవసరం.                   
 - దత్తోపంత్ ఠేంగ్డేజీ