సంస్కార సాధన పథంలో శ్రీహరి సత్సంగ్ సమితి వైశిష్ట్యం

బృందావనంలోని కేశవధామ్ శ్రీకృష్ణ కథా ప్రశిక్షణ కేంద్రం ద్వారా హార్మోని యం` తబలాపై భజనలు ఆపైన శ్రీహరి కథాగంగ పరవళ్ళు త్రొక్కుతుంటాయి. దేశభక్తి గీతాలు` దేశభక్తి భజనలు మారుమ్రోగుతుంటాయి. సభా మందిరంలో భక్తి` పారవశ్యంతో పలికే నినాదాలు` ఉత్సాహంతో ఉర్రూతలూగించే యువకులను చూస్తే, ఎవరు వారు? ఏమిటా మిషన్?! అని అడగాలని కుతూహలం ఏర్పడుతుంది.