కాశ్మీర్‌లో పాక్‌ జెండాల రెపరెపలురాడికల్‌ మహిళా సంఘం దఖ్తరన్‌ ఎ మిలాత్‌ (డిఇఎం)కు చెందిన పలువురు కార్యకర్తలు మార్చి23న పలుచోట్ల పాకిస్తాన్‌ జాతీయ పతాకాలు ఎగరవేశారు. పాకిస్తాన్‌ డే సందర్భంగా వారీ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీనగర్‌ నడిబొడ్డులోని చాల్‌చౌక్‌ సహా పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం పాక్‌ జెండాలు ఎగరేసినట్టు అధికారులు తెలిపారు. డిఇఎం కార్యకర్తలు సివిల్‌ లైన్స్‌లోనూ పాకిస్తాన్‌ జాతీయ పతకాలు ఎగరేశారు. అయితే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని వాటిని తొలగించారు. ఆసియా అంద్రాబీ నాయకత్వంలోని  డిఇఎం రాడికల్‌ సంస్థ ప్రతి ఏటా పాకిస్తాన్‌ డే నాడు ఆ దేశం జాతీయ పథకాలు ఎగరేస్తోంది. అలాగే ఆగస్టు 14 పాకిస్తాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్న ఆసియాను గత ఏడాది పోలీసులు అరెస్టు చేశారు.