నాగౌర్‌లో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ విశేషాలు2016 మార్చి, 11,12,13 తేదీలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అఖిల భారత ప్రతినిధిసభ రాజస్థాన్‌లోని నాగౌర్‌లో జరిగింది. ఈ సమావేశాలలో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి 1,058 మంది పాల్గొన్నారు. శ్రీ మోహన్‌భాగవత్‌ (పూ॥సరసంఘఛాలక్‌), శ్రీ భయ్యాజీజోషి (సర్‌కార్యవాహ) తదితర సంఘపెద్దలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతం నుండి 24 మంది పాల్గొన్నారు. ఈ సమావేశాలలో ప్రముఖంగా 1) గత సం॥ (2015-16) పని నివేదిక 2) ఈ సం॥ కార్యయోజన 3) దేశానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ దానిని తీర్మానాలుగా ఆమోదించటం 4) రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో కార్యకర్తలకు శిక్షణ (ప్రథమ, ద్వితీయ, తృతీయ) కార్యక్రమాలు ఉంటాయి. వాటికి సంబంధించిన నిర్ణయాలు జరుగుతాయి.
మార్చి 11వ తేదినాడు రాజస్థాన్‌లోని నాగౌర్‌లో అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైనాయి. ఈ సమావేశ ప్రారంభంలో మాన్య॥ సర్‌కార్యవాహ శ్రీ.భయ్యాజీ జోషి సంఘ వార్షిక నివేదికను సభ ముందు ఉంచారు. ఈ సంవత్సరం ప్రధానంగా మూడు విషయాలపైన దృష్టి పెట్టి పనిచేసినట్టుగా ఆ నివేదికలను బట్టి అర్థమవుతుంది. 1) సంఘ కార్యవిస్తరణ. 2) సామాజిక సమరసత కార్యక్రమాలు. 3) విశేషంగా సరసంఘఛాలక్‌ మోహన్‌ భాగవత్‌జీ పర్యటనలు.
ఈ సంవత్సరం విశేషంగా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో మొట్టమొదటిసారిగా ఒక సంచలన్‌ కార్యక్రమం జరిగింది.
అక్కడ జరిగిన ప్రాథమిక శిక్షవర్గలో 38మంది శిక్షణ పొందారు. ఆ 38మంది పథ సంచలన్‌ చేశారు. ఇది అక్కడ సంచలనం సృష్టించింది. చైనా సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌లో కూడా జాతీయ భావ వికాసం ఏ రకంగా వ్యాప్తి చెందుతున్నదో తెలుసుకోవటానికి ఇది ఒక మంచి ఉదాహరణ. బెంగుళూరులో 2015 జూన్‌ 12-15 వరకు మూడు రోజుల పాటు గ్రామ వికాసానికి సంబంధించి 18 అంశాలపైన విశేషంగా చర్చ జరిగింది. కర్నాటక రాష్ట్రానికి సంబంధించిన 13 జిల్లాల్లోని 673 గ్రామాల నుండి 1,819 కార్యకర్తలు శిక్షణ పొందారు. గ్రామాలలో సమగ్ర వికాసం కోసం దేశ వ్యాప్తంగా విశేష ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుజరాత్‌లో సామాజిక సద్భావన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 74 కులాలకు సంబంధించి 183 మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో సర్‌కార్యవాహ శ్రీ.భయ్యాజి జోషి ప్రసంగించారు. జనవరి 3 నుండి 10వ తేది వరకు అన్ని శాఖల్లో సద్భావన కార్యక్రమాలు జరిగాయి. ఇందులో  29,479 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. రాష్ట్రీయ సేవా భారతి ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్‌. ఈ రాష్ట్రీయ సేవా భారతి సేవ చేస్తున్నటువంటి అనేక రిజిస్టర్డ్‌ సంస్థలను సమన్వయం చేసేది. ఈ రాష్ట్రీయ సేవా భారతి ఆధ్వర్యంలో ఆ సంస్థలన్నీ పనిచేస్తుంటాయి.  వాటి ద్వారా 1,58,388 కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాననీయ॥ సర్‌కార్యవాహ దేశ పరిస్థితులను వివరిస్తూ ఈరోజున దేశంలో సెక్యూరిటీ ఏజెన్సీస్‌ టార్గెట్‌గా జాతివ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయి. ఉదాహరణకు పఠాన్‌కోటలోని ఏయిర్‌ఫోర్స్‌ బేస్‌పైన జరిగినటువంటి దాడిని మనం గమనించవచ్చు.
ఇటువంటి శక్తులు పూర్తిగా అణిచివేయాలి. ప్రభుత్వం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాని చెప్పారు. అలాగే దేశంలో మతతత్వవాదాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్న శక్తు పట్ల అప్రమత్తంగా ఉండాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బెంగాల్‌లో మాల్డా దగ్గర జరిగిన దాడును ఉదాహరించారు. ఈ మధ్య కాలంలో విశ్వవిద్యాయాలు జాతి వ్యతిరేక శక్తు కార్యకలాపాకు కేంద్రాుగా మారుతున్నాయని రకారకా సంఘటను మనకు అర్థం చేయిస్తున్నాయి. హైదరా బాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటి ఢల్లీిలోని జెఎన్‌యూ వద్ద జరిగినటువంటి సంఘటను మనం గమనిం చినట్లయితే మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో భారతీయ జీవన విధానం పైన ఆసక్తి ఎక్కువగా కనబడుతుంది. యోగా డే పేరుతో ప్రపంచ వ్యాప్తం గా అనేక దేశాల్లో జరిగిన కార్యక్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ఊహకు మించి ఆ కార్యక్రమాలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజు పాల్గొని యోగా తమ జీవితాలో ఒక భాగం చేసుకున్నట్టు కనబడుతుంది.