సర్వోన్నతం... హిందుత్వంఇటీవలి కాలంలో హిందుత్వాన్ని దూషించడం మన దేశంలో ఎక్కువైపోయింది. కానీ! బయట దేశాలవారు హిందూధర్మం యొక్క సర్వోన్నతతత్వాన్ని అర్థం చేసుకున్నట్లు కనబడుతున్నది. ఒక్కసారి అమెరికా వెళ్ళి వద్దాం రండి. చండీఘడ్‌లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ శ్రీనివాసన్‌, అమెరికా అప్పీల్స్‌ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాబోతున్నారు. ఒక హిందువు అమెరికా సుప్రీం కోర్టులో న్యాయమూర్తి కావటం అమెరికాలో ఇదే ప్రధ0మం. ఈ విషయంపై ఆదేశంలో చర్చ బాగానే జరిగింది. మేధావులు, రాజకీయనాయకులు, నిపుణులు, పత్రికలు  అందరూ లోతుగా చర్చించారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే విందాం! శ్రీనివాసన్‌ ఒక హిందువు, హిందూ మతానికి పిడివాదం లేదు, అసహనం లేదు, విశాల దృక్పథం హిందువుల స్వంతం, శాస్త్రీయంగా ఆలోచిస్తారు. కాబట్టి చట్టాన్ని సూక్ష్మంగా గ్రహించే శక్తికలిగి ఉంటారు. కాబట్టి శ్రీనివాసన్‌ తీర్పు నిష్పక్షపాతంగా ఉంటాయనిఅమెరికావారు ఆశిస్తున్నారు. శ్రీనివాసన్‌ గతంలో పదవీ స్వీకార ప్రమాణం భగవద్గీతపై చేసి ఉండటాన్ని అక్కడి ప్రజలు హర్షిస్తున్నారు.