కలియుగ మారీచ`సుబాహువులే ఈ వామ పక్షవాదులు


త్రేతా యుగంలో రామాయణ కాలంలో మారీచసుబాహువులు అనే ఇద్దరు రాక్షసులు విశ్వామిత్రుని యాగాన్ని పదేపదే భగ్నం చేయడానికి అన్నిరకాలుగా అంతరాయాలు కల్పించే వారు. దేవతలు, ఋషులు చేసే యజ్ఞ యాగాదులు జరుగకుండా రాక్షసులు అడ్డుపడేవారు. అలాంటి మారీచు, ఏచూరులు  ఈనాడు కూడా గురువు, సత్పురుషు జరిపే ధార్మిక, ఆధ్యా త్మిక కార్యక్రమాలు జరుగకుండా అడ్డుపడుతున్నారు.  వీరు వామ పక్షవాదులు. వీరు అనేక రంగాలో స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, పర్యావరణ పరిరక్షణ సంఘాలు, కార్మిక సంఘాలు, స్త్రీ స్వేచ్ఛ హక్కు సంఘాలు, రైతు సంఘాలు, జన విజ్ఞాన వేదిక మొదలైన వివిధ రూపాలో ఈ స్వచ్ఛంద సంస్థలు తమ ప్రతాపాన్ని చూపిస్తూ వుంటాయి. వీరు స్వచ్చంద సంస్థలుగా (ఎన్‌జీవోస్‌) ప్రభుత్వంలో నమోదు చేసుకొని విదేశీ నిధులు పొందుతూ వుంటాయి. విదేశీ నిధుపై నియంత్రణగానీ, జవాబుదారీతనం గాని లేవని కేంద్ర నిఘా సంస్థలు సైతం హెచ్చరిస్తున్నాయి. వీరు ఆయా రంగాలో ఉద్యమిస్తున్న ట్లు నటిస్తూనే, మౌలికంగా ఈ వామపక్ష వాద స్వచ్ఛంద సంస్థలు అంతర్గత రహస్య అజెండా ఒకటే! అదే హిందూ మత సాంప్రదాయాలు, విశ్వాసా పట్ల వ్యతిరేక ప్రచారం చేయడం. వీరు ఇతర మతవిశ్వాసాలు, మూఢనమ్మకా గురించి విమర్శించరు. కేవలం హిందూ మతంలోని విశ్వాసాను, సాంప్రదాయాపట్ల వ్యతిరేక ప్రచారం చేస్తూ సైద్ధాంతిక దాడికి తెగబడుతూ ఉంటారు.
ఇదిగో అచ్చం ఇదే కోవకు చెందినదే ఢల్లీలోని యమునా నది తీరాన పండిట్‌ రవిశంకర్‌ గురూజీ జరుపతపెట్టిన విశ్వకళ సాంస్కృతిక సమ్మేళనాన్నినిరోధించటానికి ప్రయత్నించటం, ఆ సభ విజయవంతం కాకూడదు. హిందూ ప్రాశాస్త్య్రం విదేశాలో గుర్తించబడకూడదు. విజయవంతమైతే, అంతర్జాతీయంగా హిందువులో చైతన్యం పెరుగు తుంది. ఇది వామపక్ష వాదుకు ఇష్టముండదు. అందుకొరకు అంతర్జాతీయంగా భారతదేశం పరువుపోయినా ఫరవా లేదు. ఎలాగైనా ఈ సాంస్కృతిక ఉత్సవాన్ని ఆపాలి. చివరి క్షణం వరకు పర్యావరణ ట్రిబ్యూనల్‌, న్యాయస్థానా ద్వారా ఎన్ని అవకాశాలున్నాయే అన్ని అవకాశాలు ఉపయోగించుకొని ఆపటానికి ప్రయత్నించారు గ్రీన్‌పీస్‌ అనే వామపక్షవాద స్వచ్చంద సేవా సంస్థవారు. మంచి పనుకు భగవంతుని ఆశీస్సులు ఉంటాయని అంటారు. అందువల్ల కావచ్చు, గురూజీ శ్రీశ్రీ రవిశంకర్‌ వారి మొక్కవోని దీక్ష, పట్టుదల వల్ల గావొచ్చు మార్చి 11,12,13 తేదీలో అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవం కనివినీ ఎరుగని రీతిలో విజయవంతమైంది.
ఈ సంస్థవారు గతంలో యుమునానది కాలుష్యాన్ని తగ్గించడానికి గాని, ఢల్లీలో పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న చర్యలు శూన్యం. కానీ శ్రీ గురూజీ భారీయెత్తున 197 దేశా నుండి 36,000 మంది కళాకారును, వివిధ మతవిశ్వాసా నాయకును, రాజకీయ నాయకును, కళాకారును ఒకేవేదిక మీద వసుధైక కుటుంబకంఅనే భావనతో భారతదేశ ఉన్నతమైన సంస్కృతీ వార సత్వాను, భారతదేశ ఔన్నత్యాన్ని అంతర్జాతీయ చిత్రపటంలో పతాకస్థాయిలో నిబెట్టడం స్వామి వారి ఉద్దేశం. అటువంటి మహత్తర ఉద్దేశాన్ని దేశశ్రేయస్సు దృష్ట్యా, ఔన్నత్యం దృష్ట్యా సమర్థించాలి. లేదా నచ్చనివారు తటస్థంగా ఉండాలి. కానీ ఈ కార్యక్రమం  వల్ల దేశానికిగాని దేశవాసుకు గాని ఎలాంటి నష్టం జరుగదు. కానీ గ్రీన్‌పీస్‌ అనే వామపక్షవాద స్వచ్ఛంద సంస్థ ఈ సాంస్కృతిక ఉత్సవం వల్ల యమునా నది కాలుష్యం ఏర్పడుతుందని మొసలి కన్నీరు కారుస్తూ దీన్ని ఆపటానికి న్యాయస్థానాకెక్కింది. చివరక్షణం వరకు ఆపడానికి ప్రయత్నించారు కానీ గురూజీ ధృఢ దీక్షవల్ల కార్యక్రమం అపూర్వరీతిలో విజయవంతమైంది. హిందూ సమాజం మొత్తం అందుకు గురూజీని అభినందించవసి వుంది. యావత్‌ హిందూ సమాజం చైతన్యవంతమై, ఈ వామపక్షవాద స్వచ్చంద సేవా సంస్థ కార్యక్రమా పట్ల జాగరూకతతో వహించాలి. వారి హిందూ వ్యతిరేక ప్రచారాన్ని ఎదుర్కోవాలి.
సత్యమేవజయతే