ఆర్‌ఎస్‌ఎస్‌ ముక్త భారత్‌:? నితీష్‌ కల



ఆర్‌ఎస్‌ఎస్‌ ముక్తభారత్‌ అది సాధ్యమా?’ బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఆర్‌జెడి, కాంగ్రెస్‌, లూప్రసాద్‌ పార్టీ పొత్తుతో బీహార్‌ సీఎం పీఠం ఎక్కిన తన సొంతబమెంతో తెలుసుకోలేకపోతున్నాడు. 2019 సాధారణ ఎన్నికలో ప్రధానమంత్రి పదవికి ఆశ, ఊహ పల్లకిలో ఓలాలాడుతున్నాడు. ఆ కల స్వప్నమే ఆర్‌ఎస్‌ఎస్‌ ముక్తభారత్‌పిలుపు కాసేపు చర్చ కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ అనే పదాన్ని ప్రక్కనబెడదాం. దాని భావజాలం గురించి చర్చిద్దాం. ఈ దేశంలోని (జాతి) ఏ ప్రజలైతే అనేక వే సంవత్సరాలుగా సాగిస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక (ధర్మము), సాంస్కృతిక, సదాచార, సాంప్రదాయ, నైతికత ఆధారంగా ఏ జీవన విధానమేదైతే వుందో అదే ఈ జాతికి ప్రపంచ వ్యాప్తంగా అనేక వే సంవత్సరాలుగా గుర్తింపు తెచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఏలాంటి సంబంధంలేని కొన్నికోట్ల సాధారణ పౌరులు కూడా పైన తెలిపిన జీవన మార్గంపై విశ్వాసం కలిగి తన జీవితాన్ని ఈ దేశంలో ఆ మార్గంలోనే కొనసాగిస్తున్నారు. ఈ జాతి ఈ భూమిని, మట్టిని, నదీ-నదాను, చెట్టుచేమను ప్రకృతిలోని జడత్వాన్ని, చేతనత్వాన్ని ఆరాధనా భావంతో కొలుస్తుంది. దానిని పరిరక్షిస్తూ,  మనదేశాన్ని పరమవైభవస్థితికి చేర్చడమే, ఈ భావజాలం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ దేశ ప్రజ అర్వాచీన జీవన విధానమే ఈ భావజాలం. అటువంటి జీవన విధానం ఈ దేశానికి ఆత్మలాంటిది. భారతదేశం శరీరమైతేఆ శరీరంలో నిగూఢంగా కనిపించకుండా వున్న ఆత్మలాంటిది. ఏనాడైతే ఈ శరీరం నుండి ఆత్మ వెలువడి వెళ్ళిపోతుందో ఆ శరీరము నిర్జీవమై శవమై పోతుంది. ఇది కూడా అంతే ఏనాడైతే ఈ దేశం ప్రజలో ఈ భావజాలం ఉండదో! ఈ దేశం నీర్వర్యం అయిపోతుంది. అది ఈ పవిత్రదేశానికి (జాతికి) ఊహించకూడని పరిణామం. కనుక భారతీయులారా! నితీష్‌కుమార్‌ రాజకీయం, అవకాశవాద పిలుపును లోతుగా విశ్లేషించి, రాబోయే 2019 ఎన్నికలో ఆర్‌ఎస్‌ఎస్‌ ముక్తనినాదంతో ఏకమౌతున్న కుహానా సెక్యుర్‌ పార్టీకు, అవకాశవాదుకు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలి.