నెత్తిమీద భస్మాసుర హస్తంచెరపకురా చెడేవు అన్నది మన సామెత. ఈ విషయం పాకిస్తాన్‌కు తెలిసినట్లు లేదు. అందుకే వారు తీవ్రవాదుకు పురుడుపోసి ఉగ్గుపట్టి పెంచిపోషిస్తున్నారు. ఇప్పుడు ఆ తీవ్రవాదులు పాకిస్తాన్‌పైనే గురిపెట్టారు. ఆదెబ్బతో పాకిస్తాన్‌ కళ్ళు తేలేసింది. తీవ్రవాద పాఠశాలుగా పనిచేస్తున్న 230 మదరాసాను మూసి వేసింది. తీవ్రవాదులు బచ్ఛాఖాన్‌ విశ్వవిద్యాయంపై దాడిచేసి 25 మందిని నరికేశారు. భారతదేశాన్ని నాశనం చేయటానికి పోషించబడ్డ తీవ్రవాదులు పనిలోపనిగా పాకిస్తాన్‌ను కూడా ముప్పుతిప్పులు పెడుతున్నారు. తాను సృష్టించిన తీవ్రవాది తన నెత్తిమీద చేయి పెట్టేసరికి ఏం చేయాలో పాలుపోక పాకిస్తాన్‌ తికమక పడుతున్నది.