‘జై శ్రీరామ్‌’ నినాదాలతో శ్రీరామనవమి - హనుమజ్జయంతి వేడుకలుఏప్రిల్‌ 16’ చైత్ర మాసంలో మూడు శుక్రవారాలు మూడు విశిష్టతను సంతరిచుకున్నాయి. మొదటి శుక్రవారం ` అనగా ఏప్రిల్‌ 8న ఉగాది పండుగ సందర్భంగా తెలుగు నూతన సంవత్సరాది. ముంగిట్లో ముగ్గులు, గుమ్మాకు తోరణాలు, దాదాపు ప్రతి ఇంటిపైన భగవధ్వజం అకరించుకొని షడ్రుచు సమ్మేళనం ఉగాది పచ్చడి సేవనం` పంచాంగశ్రవణం, పూ డాక్టర్‌జీ జన్మదినం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇక రెండవ శుక్రవారం - శ్రీ రామ నవమి ఉత్సవం. శ్రీ సీతారాముకళ్యాణం` కమనీయం, శ్రీరామనవమి శోభయాత్ర ఉదయం నుండి దాదాపు రాత్రి 9గం వరకు ద్విగూణీకృత ఉత్సాహంతో యువసాగర కేరటం ఉప్పొంగుతూ` జై శ్రీరామ్‌` భారత్‌మాతకిజై నినాదా జయజయ ధ్వానాతో సీతారాంబాగ్‌` ధూల్‌పేట నుండి రామకోటి వద్ద హనుమాన్‌ వ్యాయాశా వరకు వీధులు, వాడన్నియు  రామమయంగా గోచరించింది. ధూల్‌పేట ప్రాంతంలో ఆకాశపురి హనుమాన్‌ మందిరం ఆకర్షణగా నిలిచింది. సుమారు 150 అడుగుల ఎత్తైన కొండపై భక్తుకు అండగా, 15 అడుగు వరకు వేదికపై దాదాపు 51 అడుగుల వీరహనుమాన్‌ భారీ విగ్రహం సరికొత్త మురిపాన్ని సంతరించుకుంది. బేగంబజార్‌ కూడలివద్ద సాధ్విప్రాచీ - జన్మనిచ్చిన జన్మభూమికిజై చెప్పలేని ద్రోహుకు ఈ దేశంలో నివసించే హక్కులేదని గర్జించగా ఛత్రివద్ద సాధ్వి దేవాఠాకుర్‌ రామాయ నిర్మాణాన్ని ఏ శక్తి అడ్డుకోజాదని హుంకరించారు. ధూల్‌పేటలో శాసనసభ్యుడు రాజాసింగ్‌ నేతృత్వంలో ఏర్పాటైన భారి వీరహనుమాన్‌ విగ్రహ విశిష్టతపై స్పందిస్తూ సాక్షి మహరాజ్‌ ప్రత్యేకంగా  అభినందించారు. దేశంలో ముస్లీం సైతం మోది వైపు మొగ్గుచూపుతున్నారని గోవధ నిషేధానికి ప్రతి హిందువు పాటుపడవసిన అవసరం ఉందని తెలిపారు. ఇక మూడవ శుక్రవారం 22న నగరం లోనే కాకుండా గ్రామ గ్రామాలోను నగర, పట్టణాలోని ప్రతి ఆంజనేయ స్వామి దేవాయాను కేంద్రంగా చేసుకొని వి.హిం.ప, భజరంగ్‌దళ్‌, అనేక భజన మండలిలు, స్థానికదేవాయా కమిటీలు కాషాయ`పతాకాతో అలంకరించుకొని, పూజలు -  భజనలు - అన్నదానాలే కాదు విశేషంగా హనుమ విజయ యాత్రతో ప్రతి వీధి -వీధి పుకరించ పోయింది. యువకులు భక్తిశ్రద్ధతో సాత్వికశక్తిని ప్రదర్శించారు. నిష్టా - శ్రేష్ఠతతో ప్రతి కూడలీలో హనుమచాలీసా పారాయణం, శ్రీరామనామ విజయమంత్రం పఠించారు. కోఠి పరిసర ప్రాంతాలో వ్యాపారులు - విజయయాత్ర భక్తుకు మజ్జిగ, ఐస్‌క్రీమ్‌, పులిహోర, మంచినీరు విరివిగా అందించారు. ముస్లిం సైతం ముందుకొచ్చి మండుటెండలో మంచినీరు అందించి హనుమభక్తికి పాత్రులైనారు. సిద్ధి అంబర్‌ మసీదు వద్ద వేలాదిమంది ముక్తకంఠంతో వందేమాతరంగీతం ఆపించారు. భారత్‌మాతకి జై అంటూ ఒళ్ళు జదరించేలా జై`జై నినాదాలు ప్రతిధ్వనించాయి. ప్రశాంతమైన వాతావరణంలో గంభీర ఊరేగింపుకొనసాగింది. చూపరుకు మిని - వినాయక నిమజ్జన శోభయత్రను తపించింది.