చైనా చెలిమి విలువ?టెర్రరిజమ్‌పై ఉమ్మడి పోరు జరపడంలో చైనా మనతో కసి వస్తుందన్న భ్రాంతి అవశేషం కూడా మసూద్‌ అఝూర్‌ ఉదంతంతో అంతరించి పోయింది. ఇలా అంతరిచడం వల్లనే మన ప్రభుత్వం ఈ ఉయిఘర్‌ ఉద్యమకారుడిని వీసా మంజూరు చేసిందన్న భావం మనదేశంలోను, అంతర్జాతీయ సమాజంలోను అంకురించింది. కుక్క కాటుకు చెప్పుదెబ్బ..లాగా మన ప్రభుత్వం చైనాకు గుణపాఠం నేర్పిందని సంబరపడ్డాము. అంకురించిన ఆశ మరుసటి రోజున వాడిపోయింది.
డ్కాన్‌ ఈశ అనే ఉయిఘర్‌ ఉద్యమనాయకుడికి ప్రవేశ అనుమతి పత్రాన్ని నిరాకరించడం ద్వారా మన ప్రభుత్వం మరోసారి చైనా ప్రభుత్వానికి గౌరవం ఘటించింది. మనదేశ వ్యవహారా మంత్రిత్వశాఖ వారు ప్రవేశ అనుమతి-వీసా-ని జారీ చేశారు. మరుసటి రోజున విదేశ వ్యవహారా మంత్రిత్వశాఖ వారు వీసాను రద్దు చేశారు. చైనా ప్రభుత్వ నిర్వాహకును సంతృప్తి పరచడానికి ఏప్రిల్‌ 25న విదేశీయ వ్యవహారా మంత్రిత్వశాఖ వారు దీర్ఘమైన వివరణ కూడా ఇవ్వడం చైనీయు మనోభావాకు మనమిస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలో ఏప్రిల్‌ 28వ తేదీ నుంచి నాలుగు రోజు పాటు జరుగనున్న ఒక అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావడానికి వీలుగా ఈశఈ వీసాను కోరాడట. అందువల్ల దేశ వ్యవహారా మంత్రిత్వశాఖ వారు 24న వీసాను మంజూరు చేశారు. డ్కాన్‌ ఈశను చైనా ప్రభుత్వం బీభత్సకారుడని ముద్రవేసింది. సికియాంగ్‌ - ఝింఝింయాంగ్‌-లో విఛిన్న కలాపాను నిర్వహిస్తున్నట్టు ఆయనపై చైనా ప్రభుత్వం అభియోగం మోపింది. అందువల్ల చైనావారు నిరసన తెలిపిన తక్షణం మన ప్రభుత్వం ఏప్రిల్‌ 25న డ్కాన్‌ వీసాను రద్దు చేసింది. చైనా పట్ల గతంలో మన్‌మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అనుసరించిన మోకరిల్లే విధానం మళ్లీ మొదలైందా?