మరో కృష్ణభగవానుడు ఆదిశంకరాచార్య

 
భారతీయ జాతీయ జీవనంలో కృష్ణపర మాత్మ తరువాత జగద్గురు శంకరాచార్యు అవతారమే దేశంలోని మౌలికమయిన ఏకత్వానికి వ్యావహారికి రూపం చేకూర్చింది. కృష్ణభగవానుడు భిన్న భిన్నమయిన విచార శాఖల్లో భగవద్గీత ద్వారా ఏకత్వం స్థాపించడానికి ప్రయత్నించాడు. చాతురంతమయిన ధర్మరాజ్య సామ్రాజ్యం ద్వారా జాతీయతను స్థాపించాడు. శంకరాచార్యులు భారతీయైక్యత కోసం ధర్మరాజు వంటి రాజకీయ పురుషుణ్ణి తయారుచేయలేదు. కాని జాతీయ జీవనంలో ప్రతి ఒక్క క్షేత్రంలోను ఏకత్వం స్థాపించాడు. ఆ ఏకత్వంలో పారంపర్యంగా సంస్కారం నిలుపుతూ వచ్చే వాళ్ళని సృష్టించాడు. దాంతో సాంస్కృతిక జీవనంలోకి ఏకత్వానికి శక్తి భించింది. అందుచేత ఆరోజుదాకా భిన్నమయిన్నీ అంతరంగికంగా ఉన్న భారతీయైక్యభావం సత్యం కింద పరిణమించింది. అనేకత్వంలో ఏకతవ్వమన్న ప్రాచీన సిద్ధాంతానికి శంకరాచార్యులే ఆత్మిక, భౌతిక, నైతిక, ధార్మిక, సాంఘిక, రాజనైతిక క్షేత్రాల్లో తన అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించి వ్యవహారంలోకి తీసుకువచ్చాడు. ఈ సిద్ధాంతమే మానవజాతికి శాంతి, కల్యాణాలు ప్రసాదించడానికి కారణమయింది.