మేము కూడా దేశభక్తులమే!దేశభక్తి ఆర్‌ఎస్‌ఎస్‌ సొత్తు అయినట్లు మాట్లాడుతున్నారు.. మేం కూడా దేశభక్తుమే.. తెలుసా?’ అని అంటున్నారు మన ఎర్రచొక్కా సోదరులు. ఇదేదో న్యాయమైన ప్రశ్నలాగే ఉన్నది కదా! పదండి కమ్యూనిస్టు పరిపానలో ఉన్న త్రిపురకి వెళ్ళి వద్దాం! కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడి (సెకండరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) పాఠ్యపుస్తకాను సంస్కరించారు. త్రిపురలో పిల్లలు చదువుకునే పుస్తకాలో ఉన్న మహనీయుపేర్లు చూడండి.. కారల్‌ మార్క్స్‌, అడాల్ఫ్‌ హిట్లర్‌, సోవియట్‌ విప్లవం గురించి ఈ పుస్తకాలో సుదీర్ఘంగా వ్రాశారు. ఫ్రెంచ్‌ విప్లవం గురించి వ్రాశారు. అయితే ఈ పుస్తకాలో లేనివి ఏమిటో తెలుసా? సుభాష్‌చంద్రబోస్‌, ఝాన్సీరాణి, భారత స్వాతంత్య్ర పోరాటం, గాంధీ` వీరెవ్వరూ వారి చరిత్ర పుస్తకాలో కనపడరు. క్రికెట్టు పుట్టుపూర్వోత్తరా గురించి మాత్రం బాగా వ్రాశారు. భారత రాజ్యాంగం ప్రస్థావన ఎక్కడా లేదు. ఔనండీ! మీ దేశభక్తి చాలా బాగుంది.