జగమంతా నెహ్రూమయంభారతదేశం రత్నగర్భ ఎందరెందరో మహనీయులు కారణ జన్ముకులు పుట్టినిల్లు హిందూదేశం, కానీ! గత డెబ్బది సంవత్సరాలుగా, అంతా నెహ్రూ - గాంధీమయం అయిపోయింది. నగరాకి, వీధుకు, భవనాకు, ప్రణాళికకు, జంతు ప్రదర్శనశాలకు, విమానాశ్రయాకు ఒక్కటి అని ఏమిటీ అన్నింటికీ నెహ్రూ గాంధీ కుటుంబీకు పేర్లే ఉన్నాయి. ప్రజలు ఎంత నిరసించినా ఈ నామకరణాకుఅంతులేకుండా ఉన్నది, ఈ నేపథ్యంలో ప్రముఖ హిందీ చన చిత్రనటడు రుషీకపూర్‌ తన గళం ఎత్తి ప్రశ్నించాడు. ఏమిటీ దారుణం అన్నింటికీ మీ పేర్లేనా? దేశంలో ఇంకెవ్వరూ లేరా? అని తీవ్రంగా ప్రశ్నించాడు. నిజమేకదా? ప్రజ మనస్సులో ఎప్పటినుండో ఉన్న ప్రశ్న ఇప్పుడు రుషీకపూర్‌ అడిగాడు. దీనికి కాంగీ వారు సమాధానం చెప్పాలి.