ఇంట్లో పులి-వీధిలో పిల్లి


మెత్తని వాడిని చూస్తే మొత్త బుద్ధి అని సామెత. ఇటీవలి కాలంలో ప్రతి అడ్డమైనవాడు, హిందువుకు నీతిబోధన చేస్తున్నాడు. సంస్కరిస్తాం అని చెప్తూ కారుకూతలు కూస్తున్నారు. శబరిమలో స్త్రీను రానివ్వరు` శనిసింగణాపురంలో స్త్రీను రానివ్వరు, ఇది దారుణం మేం పోరాడుతాం అంటూ బయలుదేరిన భూమాత బ్రిగెడ్‌ నాయకురాలు తృప్తి దేశాయ్‌ నానా యాగీ చేసి శనిసింగణాపురంలో, త్రయంబకేశ్వరంలో దేవాయాలో చొరబడి అల్లరి చేసింది. కాని హైందవేతరు జోలికి వెళ్ళే సాహసం చేయలేకపోయింది. 12మే 2016 నాడు తృప్తీదేశాయ్‌ అట్టహాసంగా ముంబైలోని హజీఅలీదర్గాకు బయలుదేరి అక్కడ కూడా మహిళ ప్రవేశం చేయిస్తానని ఆర్భాటం చేసింది. కాని అక్కడ ఆమె ఆటలు సాగలేదు. దర్గాలో ఎక్కడైతే మహిళకు ప్రవేశం లేదో, అక్కడి దరిదాపుకు కూడా ఆమె వెళ్ళే సాహసం చేయలేదు. తన పోరాటం విజయవంతమైనదని ప్రకటన మాత్రం ఆమె చేసింది.