ఆర్‌ఎస్‌ఎస్‌ సరసంఘఛాలక్‌ సఫాయి కర్మచారుతో సహపంక్తి భోజనంఉజ్జయినిలో ఏప్రిల్‌ 22 నుండి మే 21వరకు జరిగిన సింహస్థ కుంభమేళ అనేక విశిష్టతను సంతరించుకున్నది. కుంభమేళాలు నదీస్నానాలు కేవలం వ్యక్తిగత పుణ్యఫలాకేనా? ఇందులో సామాజిక దృక్పధం వున్నదా? అనే అంశం ఈసారి ఉజ్జయిని కుంభమేళాలో అత్యంత ప్రధాన చర్చనీయాంశంగా మారింది. భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంతో కుంభమేళాలు సనాతనంగా ఆచరింపడుతున్నప్పటికీ అవి సాధువుకు, సంతుకు, సన్యాసాశ్రమంలో వున్నవారికి ధార్మికుకు సామాన్యుకు కేవలం వ్యక్తి స్నానాకే పరిమితం. కాని ఈసారి ఉజ్జయిని సింహస్థ కుంభమేళా నుండి సామాజిక దృక్పథం మారిందని చెప్పవచ్చు. దానికి ఉదాహరణే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘఛాలక్ మాననీయ మోహన్‌ జీ భాగవత్‌ గారు 1200 మంది సఫాయి కర్మచారుతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. 12,13 తేదీలో ఉజ్జయినీ కుంభమేళాలో క్షిప్రనదిలో పవిత్ర స్నాన మాచరించారు. ఆ సందర్భంగా వారు అనేక గిరిజన జాతువారితో కలిసి కుంభమేళా స్నానమాచరించారు. ఆ తరువాత వారు 13వ తేది ఉజ్జయినిలోని గురుకర్షనైక్‌ఆశ్రమం వారు నిర్వహించిన అన్న సమారాధన సఫాయి కర్మచారుతో కలిసి శ్రీమోహన్‌జీ భాగవత్‌గారు సహపంక్తి భోజనం చేసి ధార్మిక కార్యక్రమాలో సామాజిక సమరసతా దృక్పధానికి నాందీవేశారు.