పంటమార్పిడివిధానము అనుసరించుటవలన పొలములో వివిధరకములైన మట్టివరుసు ఏర్పడి నీరు
ఇంకుటకై ఉపయోగపడును.
మల్చింగ్- మట్టిని కప్పివుంచి,
నీరు ఆవిరి అయిపోకుండా
వుండడానికి ఉపయోగపడుతుంది.
కంపోష్ట్ఉపయోగించుట మొదలగు సేంద్రియ
వ్యవసాయ పద్ధతుల ద్వారా పొలము సారవంత మగుటకు వీలగును.
వాతావరణమును అనుసరించి సాగుచేయుటకు
అనుగుణమైన పంటలు వేయుట.
సాగుచేసే పొలము వద్దచెట్లను
నాటుట వలన కలిగే ఉపయోగాలు చాలాకలవు - ఈదురు గాలిని నిలువరించడము, నేలలో నత్రజని
పెంచడము, వంటచెరకు, పక్షులు మరియు ఇతర రకలవైన సరీసృపాలకు నిలువనీడ ఇయ్యడము, కలప తయారు కావడం.
ఆ. కట్టు కట్టుట
వాననీటిని సంరక్షించుటకు, పై మట్టి తొతగకుండా ఉండడానికి వీలుగా కట్టు కట్టుట
భూమి సమతంగా ఉన్నప్పటికీ నీరు వృధా కాకుండా చుట్టూ కట్టు కట్టుట.
ఇ. చెక్ డ్యాము
వాననీరు వృధా కాకుండా కొండ వ్రాలు నుండి లోయవరకు గట్లు కట్టడం.
కట్టలను సంరక్షించుటకు వెదురుపోదవంటి చెట్లు నీటి పరీవాహక
ప్రాంతములోనాటుట వలన పైనుండిచెక్
డ్యాములోకినీరు పడేటప్పుడు మట్టి కొట్టు కొని పోకుండా వుంటుంది.
స్ధానికముగా దొరికే పదార్ధముతోనే చెక్‌డ్యాము నిర్మించుకొనవచ్చును.
సమతప్రదేశములో కూడా పొలము చుట్టూ కట్టు కట్టడము వననీరు వృధా
కాకుండావుంటుంది.
ఆవశ్యకత
నీటి ఎద్దడిని ఎదుర్కొనుటకు.
భూమిలో నీటిమట్టము పెరుగుటకు.
అవసరాన్నిబట్టి అవకాశాన్నిబట్టి భూగర్భ నీటిని ఉపయోగించు నీటిని ఉపయోగించుట
వాననీటి సంరక్షణ ద్వారా పట్టణప్రాంతములో వాననీరు భూమిలోనికి ఇంకి తగ్గిన భూగర్భ నీటిమట్టము పెరుగుటకు అవకాశముకలుగుట
భూగర్భజలా సాంద్రత తగ్గే అవకాశము.
వ్యవసాయ ఉత్పత్తి పెంపుదకొరకు
చెట్లు నాటుట వలన పరిసరాలు బాగుపడుటకు న్యూఢల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్ మెంట్ వారి అంచనా
ప్రకారము భారతదేశములో కురిసే వర్షము యొక్క 2% నీటిని ఒడిసి
పట్టటం వలన మనిషికి 26 గాలనుల నీటిని సరఫరా చేయవచ్చును.
సాంకేతిక విధానాలు
ఏటవాలు ప్రదేశము, నదులు, వాగులు, వంకలు, కాలువలోనికి వృధాగా పోయే నీటిని ఈక్రింది పద్ధతుల వలన నిలువరించవచ్చును
గల్లీ ప్లగ్మరియు కట్ట
గాబియన్ స్ట్రక్చరు
ర్కొలేషన్ ట్యాంక్
చెక్ డ్యాము, సిమెంట్ ప్లగ్, కాలుర కట్ట
రిఛార్జిషాఫ్ట్
డగ్ వెల్ రిఛార్జి
భూగర్భ జలాలకు ఆనకట్టు, డైకులు
గల్లీ ప్లగ్ మరియుకట్ట ద్వారా వాననీటి సంరక్షణ
గల్లీ ప్లగ్‌ను స్థానికముగా లభించే రాళ్ళు, మట్టి, పొదలు మొదలైన వాటిని కొండమీది నుండి కాచ్
మెంట్లలోకి పారే చిన్న చిన్న కాలువలు వాగులకు అడ్డంగా వేసి వర్షాకాములో నీటిని
మళ్ళించవలెను.
పొలము చుట్టూ కట్టే
కట్టల వలన చాలా రోజుల వరకు భూమిలో తేమ వుంటుంది
తక్కువ వర్షపాతం గల ప్రాంతాలలో ఈ పద్ధతి ఎంతో
ఉపయోగపడుతుంది. పారే వ్యర్ధమయ్యే నీటిని జాగ్రత్త పరచవచ్చును
కట్టలమధ్య తగినంత
దూరము ఉంచుట వలన పారేనీటి వేగము తగ్గంచవచ్చును
కాంటూరు కట్టల మధ్య దూరము ఏటవాలు తనము మరియు భూమి స్వభావమును బట్టి ఉండవలెను.
నీరు త్వరగా ఇంకని ప్రాంతల్లో కట్టు దగ్గరగా ఉండాలి.
ఒకమోస్తరు ఏటవాలుగా వున్న ప్రదేశాలకు ఈ పద్ధతి అనుసరణీయము.