ఉత్తరప్రదేశ్‌లో హిందువుల దైన్యస్థితియుపిలో శాంతి భద్రత పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తున్నది. అతిపెద్ద రాష్ట్రానికి గృహమంత్రిలేడు. ముఖ్యమంత్రే స్వయంగా గృహ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు. ఇతర (మంత్రు) లు తెలివిమంతులు కాదు. అంతా ఇద్దరు మంత్రులు అజంఖాన్‌, శివపాల్‌ యాదవ్‌ పర్యవేక్షణలో, కనుసన్నలో జరిగిపోతుంటుంది. ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ఆలోచనకు వాళ్ళ నాన్న ములాయం సింగ్‌ యాదవ్‌ మాటకు పొంతన ఉండదు. రాష్ట్ర విస్తీర్ణం ఎక్కువ, పోలీసు సంఖ్య తక్కువ. కోటిమంది నిరుద్యోగులున్నారు. నిరుద్యోగం వల్ల వచ్చే ఆర్థిక సంకటం ఎదుర్కొనేందుకు అసాంఘిక కార్యకలాపాకు పాల్పడుతారు. పాన శూన్యం. అంతా గూండారాజ్యమే. ఒక జాతీయ ఛానెల్‌ నిర్వహించిన సర్వేలో వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ కేవలం 80 సీట్లకే పరిమితమవుతుంది అని అంచనా. ఈ మధ్య ఒక సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు స్థానిక ఎన్నికల్లో గెలిచిన సంబరంలో సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు కాల్పులు జరిపారు. బదౌన్‌లో జరిగిన ఇద్దరు బాలిక హత్య జాతీయ సమస్య అయింది. హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, బందిపోట్ల ఆగడాలు, అల్లర్లు పెరిగాయి. అన్ని పెద్ద మంత్రిత్వశాఖలు, ములాయం కుటుంబీకు చేతుల్లో వున్నాయి. అన్ని పానాయంత్రాంగ పదవులు ఒకే కులం వారి చేతిలో వున్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద జాతీయ రహదారి వారణాసి, శక్తినగర్‌ మధ్య ఉంది. ఆ రహదారి వెంట చాలా పారిశ్రామికవాడులున్నాయి. దాన్ని కిల్లర్‌రోడ్‌ అని కూడా అంటారు. ఆ దారిలో ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. అయినా ఆ రోడ్డును బాగుచేద్దామన్న ఆలోచన అఖిలేష్‌ ప్రభుత్వానికి లేదు. తాజాగా బిజెపి పార్లమెంటు సభ్యుడు మకుల్‌సింగ్‌ ‘‘కైరానాప్రాంతం నుండి 346 హిందూ కుటుంబాలు ఇళ్లు విడిచిపెట్టి వెళ్ళారనిచేసిన ప్రకటనతో యుపిలో దిగజారిన హిందువు పరిస్థితి మిగిలిన దేశానికి తెలియ వచ్చింది. కాండ్లా నుండి కూడా (షామిలీ జిల్లా) మరో 63 కుటుంబాలుస వెళ్ళాయని ఆయన మరో జాబితా విడుద చేశారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కథనం ప్రకారం బెదిరింపులు, భయానక వాతావరణం సృష్టించిన స్థానిక ముస్లింల వల్ల వారి ఆకృత్యాలవల్లనే హిందువులు కైరానాప్రాంతం విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే అఖిలేష్‌ ప్రభుత్వం ఆ సూచీలో కొందరు చనిపోయారని, 10 ఏళ్ళ క్రితమే కైరానా విడిచారని, కొందరు పిల్లల చదవుకోసం వస వెళ్ళారని బుకాయి స్తున్నది. యుపి ప్రభుత్వం ఈ విషయమై చర్యలు తీసుకోవాని, నివేదిక ఇవ్వాని కేంద్ర హోం శాఖ మంత్రి ఆదేశించారు. 1990లో కాశ్మీరులో హిందువుపై జరిగిన ఆగడాలే కైరానాలో కూడా జరిగాయి. కైరానా ఢల్లీకి 124 కి.మీటర్ల దూరంలో ఉంది. 2011 జనాభా లెక్క ప్రకారం అక్కడ 30% హిందువులు 68% ముస్లింలు వున్నారు. కాని ప్రస్తుతం కేవలం 8% హిందువులు 92 ముస్లింలున్నారు. 2013లో మత ఘర్షణలో అట్టుడికిన ముజఫర్‌న గర్‌కు ఇది దగ్గరలోనే ఉంది. నలుగురు వ్యాపారస్థులు ఈ మధ్యనే హత్య చేయబడ్డారు. కైరానాకు వెళ్ళి విషయం తెలుసుకుందామని బయుదేరిన 32 మంది హిందూ మహాసభ, శివసేన కార్యకర్తల్ని యుపి పోలీసులు నిర్భందించారు. జాతీయ మానవహక్కు సంఘం జూన్‌ 10న యుపి ప్రభుత్వానికి కైరానావిషయమై నోటీసు జారీ చేసింది. నిజనిర్ధారణకై ఒక కమిటీని నియమించి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాని కోరింది. యుపి, సహరా న్‌పూర్‌ జిల్లాలోని దేవబంద్‌ నుంచి కూడా 40 హిందూ కుటుంబాలు తరళివెళ్ళాయని, దేవబంద్‌ పట్టణంలోని ముఖ్యమైన ఆరు హిందువుయాలు కబ్జాకు గురవుతున్నాయని విశ్వహిందూ పరిషత్‌ ఆరోపించింది. మధురలో ఈ మధ్యనే జవహర్‌పార్కు లో అక్రమ నివాసం ఏర్పరుచుకున్న కొన్ని కుటుంబాను ఖాళీ చేయించా న్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన హింస తక్కువ కాదు. యువకుడైన ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ సుపరిపానపై దృష్టి పెట్టకుండా ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాకు పాల్పడడం శోచనీయం. వ వెళ్ళిన హిందువుల ఇళ్లపై ఈ ఇల్లు అమ్మకానికిఅన్న రాతలు రాయబడ్డాయి. యుపి, దాద్రిలో గోమాంస భక్షణ చేశాడన్న అనుమానంతో హత్యకు గురియైన ముస్లింపట్ల ప్రజాసంఘాలు, పౌరహక్కునేతలు, కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ పార్టీ, జనతాదళ్‌లు గగోగ్గులు పెట్టి అసహనంపేర రభస చేశాయి. బీహారు ఎన్నికల్లో గెలిచాయి. మరి కైరానాలో ముస్లిం దౌర్జన్యం పట్ల వీరంతా ఎందుకు స్పందించరు. గత నె రోజులుగా షామిలి జిల్లాలో మతఘర్షణలు చోటుచేసుకున్నాయి.. పోలీసులు ప్రభుత్వం ముస్లిం కొమ్ముకాస్తున్నది. సికిందర్‌పూర్‌, చార్తావాక, కటిలీ, దహేద, అబ్బేర్‌ పూర్‌, భల్వా వంటిచోట్ల కూడా మత ఘర్షణలు జరుగుతున్నాయి. కైరానా పరిసర ప్రాంతాల్లో హిందువులు జాగృతమయ్యారు. 2017 యుపి ఎన్నికను ఈ సంఘటనలు తప్పక ప్రభావితం చేస్తాయి.