గ్రామ స్వయం సంవృద్ధి ప్రజల సంకల్పం కావాలి..
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి రేపు ఆగష్టు 15తో 69 సంవత్సరాలు పూర్తయ్యి 70 సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నది. 1200 సంవత్సరా నిరంతర సంఘర్షణ తర్వాత భారతదేశానికి 1947 ఆగష్టు 15నాడు స్వాతంత్య్రం వచ్చింది. అదే సమయంలో 1947 ఆగష్టు 14వ తేది నాడు ప్రపంచ పటంలో పాకిస్తాన్‌ అనే పేరుతో భారతదేశం నుంచి ఒక దేశం విడిపోయింది. ప్రపంచంలో మతం ఆధారంగా ఏర్పడిన దేశం బహుశా ఆ దేశం ఒక్కటే కావచ్చు. ఆ దేశం ఏర్పడటమే ఒక విద్వేష భావంతో ఏర్పడింది. ఆ విద్వేషం ఆరోజు నుండి ఈ రోజు వరకు అట్లాగే కొనసాగుతున్నది. ఆ దేశ విభజన నుండి ఈ దేశ పాకులు ఎటు వంటి పాఠాన్ని నేర్చుకోలేదు. ఈ విభజనతో మనం ఏమి సాధించుకున్నాం అంటే 1) ఈ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకోలేకపోయాం. 2) వేలాది సంవత్సరా ఈ దేశ సాంస్కృతిక జాతీయ భావాకు అవమానం కగజేయటమే కాక దానిని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాం. మతాన్ని జాతీయతతో ముడిపెట్టి భిన్నజాతు  సిద్ధాంతాకు బలం చేకూర్చాం. దాని ప్రభావం ఈరోజున కూడా దేశంలో కనబడుతుంది.  గడిచిన 69 సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతున్న పరిణామాను గమనించినట్తైతే ఈ దేశంలో ఇస్లా మిక్‌ ఉగ్రవాదం దేశానికి ఒక పెనుసవాలు విసురుతున్నది అని అర్థమవుతుంది. మరోప్రక్క క్రైస్తవం చాపకింద నీరులాగా మతం మార్పిడిలు చేసుకుంటూ ఈ దేశాన్ని బహీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నది. మరోప్రక్క కమ్యూనిస్టులు ఇది ఒక దేశం కాదు ఒక జాతి కాదు ఇది అనేక జాతు సమూహరం అని గడిచిన 70 సంవత్సరాకుపైగా అలుపెరగకుండా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. జాతు  స్వాంతంత్య్రాన్ని మేము సమర్థిస్తామూ అంటూ కాశ్మీరులో జరుగుతున్న వేర్పాటు వాదాన్ని పూర్తిగా సమర్థిస్తున్నారు. ఇండియా ఈజ్‌ ఏ నేషన్స్‌ ఆఫ్‌ నేషన్‌ అనే మాటను ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్ని ఈ దేశం యొక్క సార్వభౌమత్వానికి పెను సవాళ్ళుగా నిలుస్తున్నాయి. భారతదేశంలో బీదరికం, అభివృద్ధి ఈ రెండు పోటీపడి మరీ పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో నిర్మాణమైన దయనీయ పరిస్థితులు చూసినట్లైతే రాబోయే రోజుల్లో ఈ దేశం ఎటువంటి స్థితిలో ఉంటుందో ఆందోళన కలుగుతున్నది. 6క్షకు పైగా గ్రామాలున్న భారతదేశం యొక్క అభివృద్ధి, గ్రామీణాభివృద్ధే నిజమైన అభివృద్ధి ఈ విషయాన్ని విస్మరించి పనిచేసుకుంటూ వస్తున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ విషయంపై పూర్తి శ్రద్ధ ఉంచి గ్రామాను స్వయం సమృద్ధంగా చేయటంలో కృషి చేయావసిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో మహాత్మాగాంధీజి ఈ దేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చింది ఇంకా రావాల్సింది గ్రామ స్వరాజ్‌ అట్లాగే గ్రామ స్వయం సమృద్ధి అని పిలుపు నిచ్చారు. గ్రామాను సర్వతంత్ర స్వతంత్రంగా నిర్మాణం చేయటమే ఈ దేశం యొక్క సమగ్రతకు ఒక ఆధారం అవుతుంది. రాబోవు రోజుల్లో ఈ దేశంలో ప్రజలు, పాకులు ఈ దిశలో కృషిచేయటమే ఇప్పటి తక్షణ అవసరం, అదే నిజమైన స్వాతంత్య్రం అవుతుంది.