మంజీరా నది పునరుద్ధరణ - లాథూర్‌ ప్రజల సంకల్పంప్రకృతి వైపరీత్యా సమయంలో చేతులు ముడుచుకుని దీనంగా కూర్చోకుండా ధైర్యసాహసాతో కలిసికట్టుగా పనిచేసి ఆ పరిస్థితును పూర్తిగా చక్కదిద్దుకోగరు అని చెప్పటానికి ఒక మంచి ఉదాహరణగా లాథూర్‌ ప్రజలు దేశం ముందు నిబడ్డారని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సరసంఘఛాలక్ డా॥మోహన్‌ భాగవత్‌ గారు లాథూరులో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. లాథూర్‌లోని జసంయుక్త సమితి ఆధ్వర్యంలో మంజీరానది పైసా యి నుండి నాగఝురి వరకు 15కిలోమీటర్ల దూరం ప్రజ సహకారంతో నది యొక్క పునరుద్ధరణ కార్యక్రమం జరిగింది. దాని చివరిదశలో అక్కడే ఉన్న నాగేశ్వర మందిర ప్రాంగణంలో జపూజ కార్యక్రమం నిర్వహించబడింది. ఆ కార్యక్రమంలో మోహన్‌ జీ భాగవత్‌ పాల్గొని మాట్లాడుతూ మంజీర నది పునరుద్ధరణ కార్యక్రమం దేశంలోని ప్రజలందరికి ఒక దిశ నిర్దేశనం చేయగదంటూ ప్రసంశించారు.
యుక్త సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడిన సభా కార్యక్రమానికి ఆ సమితి అధ్యక్షులు డా॥ అశోక్‌ రావుజీ కుక్డే కాకా అధ్యక్షత వహించారు. వైదిక మంత్రో చ్ఛరణతో జపూజ కార్యక్రమం నిర్వహించ బడింది. గంగామాతాకీ జై, భారత్‌మాతాకీ జై అన్న నినాదాతో ఆ సభ ప్రాంగణం మారుమ్రోగింది. మంజీర నది పునరుద్ధ రణ సమితి అధ్యక్షులు డా॥ కుక్డే కాకాను సరసంఘ చాక్‌గారు ప్రసంశించారు. సమాజంలో బేధాభి ప్రాయాలు ఉండవచ్చుకాని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనం అందరం ఒకే త్రాటిపై నిలిచి వాటిని చక్కదిద్దుకొనేందుకు కలిసి ప్రయత్నం చేయాలి. లాథూర్‌లో ఇదే జరిగింది. సంఘం సమాజంలో ఇటువంటి ఐకమత్యాన్నే కోరుకుంటుంది. లాథూర్‌ లో జ సమస్య ఉత్పన్నమైనప్పుడు అక్కడి ప్రజలు పలాయనమార్గాన్ని ఎంచుకోకుండా దానిని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. అందరూ ఐకమత్యంతో కలిసి పనిచేశారు. ఇది దేశానికి ఒక మంచి ఉదాహరణ. లాథూర్‌ మంజీరా నదియొక్క పునరుద్ధరణ సమితిలోని 11 మంది సభ్యును డా. అశోక్‌ రావ్‌ కుక్డే కాకా సభకు పరిచయం చేశారు. లాథూరు కార్యక్రమము గురించి సభకు వివరించారు. లాతూరు పాణీ అన్న మాటలే అందరిని ఒకటిగా చేశాయి అన్నారు. ఈ కార్యక్రమము జన సహకారంతోనే సాధ్యమయ్యింది. ప్రజ యొక్క, ప్రజ ద్వారా, ప్రజ కొరకు జరుప బడింది. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థకు చెందిన మకరంద్‌ జాధవ్‌ మరియు నీలేష్‌ జీ ఠక్కర్‌ లాతూరులో జరిగిన ఈ ప్రక్పము యొక్క ఉపయోగా గురించి వివరించారు.