భారతీయ విద్యాబోధన దేశ ప్రగతికి, సమైక్యతకు దోహదం చేస్తుందిభారతదేశం యావత్తు దేవనాగరి లిపిపద్ధతిని స్వీకరించాని నాగరి ప్రచారిణి సభలో తిక్‌ ప్రసంగిస్తూ చెప్పారు. ఈ లిపిలోనే అచ్చు వేయబడిన పాఠ్యపుస్తకాను దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాథమిక పాఠశాలకు అందచేసి విద్యా ప్రారంభం చేయాని కోరారు.
పూనాలో మహారాష్ట్ర విద్యాప్రాసారక్‌ అనే సంస్థ స్థాపించారు. దాని ప్రోద్బలంతో లెగోన్‌లో సమర్థ విద్యాయము ప్రారంభించారు. తిక్‌ తను నిర్వహించే ప్రతి పనిలో తన ఆలోచనను రంగరించేవారు. భారతీయ విద్యాబోధనదేశాన్ని ప్రగతిపథంవైపు, దేశంలోని సమైక్యత ఆప్యాయతకు కారణభూత మౌతుందని పలికాడు.
స్వదేశీ ఉద్యమంతో ప్రజకు ఉత్సాహాన్ని అందిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాను ఇచ్చారు. భగవంతుడు బాధలో ఉన్న ప్రజ వద్దకు తప్పక వస్తాడు. మాతృ భూమిని మరువకూడదు. మరిస్తే ఒకరి తరువాత ఒకరు పడిపోక తప్పదు. అదే సమైక్యతతో పోరాడితే మాతృభూమి మనదే అవుతుంది. అదే మన వారసులందరికి మనమిచ్చే గొప్పకానుక. పిరికి తనంతో వెనుతిరిగితే వారసత్వానికి బానిస బ్రతుకును కానుకగా ఇవ్వవసి వస్తుంది. హిందూ సంస్కృతి ఎన్నడూ విరోధాన్ని ప్రోత్సహించదు. కానీ మాతృభూమి సంరక్షణ కోసం పోరాటం తప్పదు. ప్రతి ఒక్క భారతీయుడు స్వాతంత్య్రం కొరకు కష్టపడి పనిచేయవసిన అవసరం ఉంది. పోరాటం మొదలైంది. భవిష్యత్తు అంధకారంగా ఎల్లకాలం ఉండదు. వెలుగులు తప్పక వస్తుంది. కలిసి కట్టుగా విజయాన్ని పొందుదాముఅని పిలుపునిచ్చారు.
-బాగంగాధర్‌ తిక్‌