వర్షపు నీటిని సంరక్షించుకోవాలి- జసంరక్షణ - 3
(గత సంచిక తరువాయి)
గాబియన్‌ స్ట్రక్చరు ద్వారా వాన నీటి సంరక్షణ
1. వాగుయొక్క పరీవాహక ప్రాంతము ముగిసి ఇంక నీరు ఇంకే అవకాశము లేని పరిస్ధితులో ఈ కట్టడము నిర్మించ వలెను.
2. స్ధానికముగా భించే రాళ్లను ఇనుప తీగలో వుంచి అడ్డుగా వేస్తారు.
3.ఈ కట్టడా ఎత్తు 0.5 మీటర్లకన్నా మించి వుండదు. ఇవి 10 మీటర్లకన్నా తక్కువ దూరము ప్రవహించే వాగువద్ద నిర్మిస్తారు.
4. ఎక్కువైన నీరుకట్ట మీదినుండి ప్రవహిస్తుంది. నీటి అడుగు మట్టి రాళ్ళ మధ్యలో ఇరుక్కొని  మొక్క పెరగడానికి ఆస్కారం వుంటుంది. దీని వన గట్టు గట్టి పడుతుంది మరియు నీరు నిలిచి రీఛార్జి అయ్యేవీలులుగుతుంది.
పర్కొలేషన్‌ ట్యాంకుద్వారా వాననీటి సంరక్షణ
1. పర్కొలేషన్‌ ట్యాంకులు కృత్రిమ పద్ధతిలో నిర్మిస్తారు దీనిలోనున్న భూమి నీరు ఇంకడానికి అనువుగా వుంటుంది. దీని వన వర్షపు నీరు ఇంకడానికి వీలుగా వుంటుంది.
2. పర్కొలేషన్‌ ట్యాంక్‌ను రెండు లేక మూడవ స్థానములో ఎక్కువగా పగిలి పోయిన రాళ్ళ మధ్యలో ప్రక్కవాలుగా నీరు ప్రవహించే స్థలాలో కడతారు.
3. క్రింది ప్రదేశములో తగినన్ని బావులు, సాగుచేయడానికి వీయిన భూమి వుండాలి.
4. పర్కొలేషన్‌ ట్యాంకు సాధారణంగా మట్టితో నర్మించబడతాయి. నీరు ప్రవహించే కాలువను మాత్రము సిమెంటుతో చేస్తారు. పర్కొలేషన్‌ ట్యాంకు కట్టడం యోక్క ఉద్దేశ్యము భూగర్భనీటి మట్టము పెంచుట. దీని కోసము నీరు ఇంకుట ఆవశ్యకము. 4.5 మీటర్ల ఎత్తు గ డ్యాముకు కట్‌ ఆఫ్‌ ట్రెంచి అవసరము లేదు. డ్యాముకీ భూమికీ మధ్య వున్న ఖాళీ ప్రదేశము సరిపోతుంది.
చెక్‌ డ్యాము, సిమెంట్‌ ప్లగ్‌, కాలువకట్టతో వాననీటి సంరక్షణ
1. చెక్‌ డ్యాములు వాగులు కొంచెం ఏటవాలుగా ప్రవహించే ప్రదేశాలో కడతారు. అవి కట్టె స్థలము ఎక్కువ మట్టి కలిగియుండి నీరు ఇంకే స్వభావము కలిగినదైయుండవలెను. దీనివన భూగర్భజము రీ ఛార్జి అగుటకు వీలుండును.
2. ఈ కట్టడాలో నీరు పరివహక ప్రాంతము వరకే నిలువయుండును. దాని ఎత్తు 2 మీటర్లకు మించియుండదు.  ఎక్కువైన నీరు గట్టుమీదగా బయటకు ప్రవహించును.
3. అధికముగా వాగులో ప్రవహించే నీటిని సంరక్షించుటకు వరుసగా చెక్‌ డ్యాములు కట్ట వలెను.
4. చిన్నచిన్న కాలువలోని నీరు నిలువచేయుటకు బంకమట్టిని సిమెంటు బస్తాలో నింపి గట్లుగా వేస్తారు. కొన్ని ప్రదేశాలో ట్రెంచీలు త్రవ్వి ఆస్బె స్టాస్‌ రేకులు కాలువకుఅడ్డంగా వుంచుతారు.  రెండు రేకు మధ్యగ ఖాళీని బంకమట్టితో నింపుతారు.  కొద్ది ఖర్చుతోనే చెక్‌ డ్యాము నిర్మాణము అవుతుంది. వాగులు మొదలైన చోటకట్టడ మునకు బమునిచ్చేందుకు మరియు నీరు ప్రవహించేందుకు వీలుగా బంకమట్టిని సిమెంటు బస్తాలో నింపి ఏటవాలుగా వుంచుతారు.
రిఛార్జిషాఫ్ట్ద్వారా వాననీటి సంరక్షణ
1. నీరు ఇంకుటకుఅనువుగాలేనిచోట్లలో ఈ పధ్ధతి ఖర్చుతక్కువతోఎంతో ఉపయోగపడుతుంది.
2. 2 మీటర్లకన్నా తక్కువ వ్యాసముతో ఒక గుంటను త్రవ్వవలెను.
3. ఆ గుంట నీరు పీల్చేస్వభావముగ భూమి పొర తగిలేవరకు త్రవ్వవలెను.నీటి మట్టము తగిలే అవసరము లేదు.
4. ఆ గుంటను రాళ్ళు, కంకర మరియు బరక ఇసుకతో నింపవలెను.
5. ఒకవేళ గుంట ప్లాష్టరు చేసియున్న యెడ నీటిని పైపు ద్వారా ఫిల్టరు వరకు పంపించవలెను.
6. ఈ కట్టడాలు నీటిని ఇంకించే శక్తి లేని భూముకు ఎంతో ఉపయోగపడును.
7. కొన్ని గ్రామాలో వర్షాకాములో చెరువులు నిండుగా వున్నప్పటికీ పూడిక వన నీరు ఇంకే స్వభావము కోల్పోవుటవన చుట్టు ప్రక్కనున్న బావుబోర్‌, బావులో నీరు లేకపోవడం చూడగము. గ్రామాలోని చెరువులోని నీరు వృధాగా నిరుపయోగంగా ఆవిరి అయిపోతుంది.
8. రీఛార్జి షాఫ్టులు చెరువులో నిర్మిచుట వన మిగులు నీరు భూగర్బజలామట్టము పెరుగుటకు ఉపయోగపడును. నీటి భ్యతననుసరించి 0.5 మీటర్ల నుండి 3 మీటర్ల వ్యాసము 10 నుండి 15 మీటర్ల లోతుగ షాఫ్టులు నిర్మించవలెను. షాఫ్ట ఉపరిభాగము చెరువునీటిమట్టము పైన వచ్చేటట్లు ఉండవలెను. ఈ షాఫ్టును రాళ్లు, గుక రాళ్ళు మరియు బరక ఇసుకతో నింపవలెను.
9.  కట్టడము బలంగా వుండడానికి 1 లేక 2 మీటర్ల వరకు సిమెంటు చేయవలెను.
10 ఈ పధ్ధతి వన చెరువులో ఎక్కువైన నీరు షాఫ్టు గుండా భూమిలోకి ఇంకి భూగర్భజమట్ట ము పెరుగుటకు సహకరించును. త్రాగు నీటి వ్యవస్ధ కొరకు తగినంత నీరు చెరువులో మిగిలియుండును.
త్రవ్వియున్నబావురిఛార్జిద్వారా వాననీటి సంరక్షణ
1. నిరుపయోగంగావున్నబావును శుభ్రము చేసి పూడిక తీసిన పిదప రిఛార్జి కొరకు ఉపయోగించవచ్చును.
2. రిఛార్జిచేయుటకు ఉపయోగించే నీటిని పైపుద్వారా బావి అడుగుభాగమునకు చేర్చవలెను.
3. రిఛార్జినీరు మట్టి లేకుండా ఉండవలెను.  అధికముగావున్న నీటిని డిసిల్టింగ్‌ ఛేంబరు ద్వారా ప్రవహింపజేయవలెను.
4. అప్పుడప్పుడూ క్లోరినేషన్‌ చేయుటం వన బాక్టీరియాను నివారించవచ్చును.