చిన్నారుల వెలుగులుప్రతి ఒక్కరికీ బాల్యం అనేది చాలా అందమైనదీ, అద్భుతమైనది. కానీ నేటికాలంలోని పిల్లలకు బాల్యపు మధురమనేవి తెలియడం లేదన్నది అక్షర సత్యం. మారుమూ  గ్రామాల్లో కనీస హక్కు పొందలేని, నిరుపేద పిల్లలు ఎంతోమంది పేదరికం వల్లనో... కనీస సౌకర్యాలు లేకపోవడం వల్లనో కనీస హక్కు లేక వారి బాల్యం వడలిపోతున్న వైనం ప్రతీ చోటా కనిపిస్తూనే ఉంటుంది. ఇవాలిటి పిల్లలే రేపటి భావి పౌరులు అనే సత్యాన్ని మరిచి కొనసాగుతున్న ఈసమాజపు పోకడను సరిదిద్దడానికి ఉద్భవించిన సంస్థే మిత్సుకో. ఈ పదం జపానీ స్‌ భాషకు చెందిన పదం. దాని అర్థం చిన్నారు వెలుగు. గోవాలోని పంజిమ్‌ కేంద్రంగా ఉంటూ తమ హక్కులు పొందలేని చిన్నారు సాధికారత కోసం సేవా కార్యక్రమాలు చేపడుతోంది. చిన్నారులు కూడా సమాజంలో భాగమేనని వారిని కూడా నిర్ణయాలు తీసుకునే విషయంలో బాగస్వా మ్యం చేయానేది ట్రస్ట్‌ క్ష్యం. దీన్ని నిర్వహిస్తోంది శ్యామలీ రే.
గోవాలోని ఓ మరుమూ గ్రామం.. అక్కడ పిల్లలంతా సమావేశమయ్యారు.. తాము ఎదుర్కొం టున్న సమస్యపై చర్చించుకుంటున్నారు... తమకు టాయిలెట్‌ లేదని ఓ చిన్నారి తన సమస్యను అక్కడ గట్టిగా వినిపిస్తున్నాడు..! గోవాలో ఇంకో గ్రామం.. అక్కడ పిల్లలంతా మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటున్నారు. కిక్కు, పంచుల్లో ఒకరిని మించి ఒకరు ప్రతిభ చూపిస్తున్నారు. వారికి ప్రసిద్ధ మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణుడు షెరా శిక్షణ ఇస్తున్నారు. మరో గ్రామంలో పిల్లలు నాటక విద్యను అభ్యసిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ట్రస్ట్‌ సహకారంతో గోవాలోని మరుమూ గ్రామాల్లో కనీస హక్కులు పొందలేని, నిరుపేద పిల్లలు ఎంతోమంది తమకు తెలియకుండానే తమ సాధికారిత కోసం పనిచేసుకుంటూ పోతున్నారు
ప్రారంభమైంది ఇలా
చిన్నారులు ఈ ప్రపంచంలో వారికి ఉన్న స్థానాన్ని వారు అస్వాదించేలా చేయడమే మిత్సుకో ట్రస్ట్‌ ప్రథమ ప్రాధాన్యం.1995 సంవత్సరం... అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ సంస్థ కోసం పనిచేసేందుకు జపాన్‌కు చెందిన మిత్సుకో అనే యువతి తన భర్త, డానియల్‌తో కలిసి ఢల్లీకి వచ్చారు. అదే సమయంలో బెంగాల్‌కు చెందిన శ్యామలీ రే కూడా  రెడ్‌ క్రాస్‌ కోసమే ఢల్లీలో పనిచేస్తున్నారు. అలా ఏ సమయంలో వెళ్లినా ఢల్లీలో ఎక్కడైనా వీరి కారు ఆగినప్పుడల్లా వీధి బాలు చేయి చాస్తూ కారు చుట్టూ మూగేవారు. వీరి కోసం ఏదైనా చేయాని వీరి ఆలోచనలు ప్రాథమిక దశలోనే ఉండగా.. 2007లో మిత్సుకో క్యాన్సర్‌తో కన్నుమూశారు. దీంతో మిత్సుకో భర్త.. ఆమె ఆశయాన్ని సాధించేందుకు ఓ స్వచ్చంద సంస్థను శ్యామలీతో కలిసి ప్రారంభించాని సంకల్పించారు. దాని ఫలితమే ‘‘మిత్సుకో ట్రస్ట్‌’’ ఆవిర్భావం. 2009లో గోవా నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. 
ఎన్నో సవాళ్లు... శ్యామలీకి ట్రస్ట్‌ నడపడం అంత సులువుగా ఏమీ లేదు. ఎన్నో సవాళ్లను మొదటి నుంచి ఎదుర్కొంటూనే ఉన్నారు. కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ఆమెకు నెల తరబడి సమయం పడుతోంది. గ్రామాల్లో పెద్దను ఒప్పించడం.. ప్రభుత్వా నుంచి పర్మిషన్లు తీసుకురావడం.. ఇలాంటివి ఎలాగోలా సర్దుబాటు చేసుకున్నా నిధు సమస్య శ్యామలీ రే ఆశయాన్ని భారీస్థాయిలో ముందుకు తీసుకెళ్లకుండా అడ్డుపడుతోంది. గోవా ప్రభుత్వ సహకారం.. మరికొన్ని ఏజన్సీ సాయంతో ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. అయితే ఎన్ని ఆటంకాలెదురైనా వెనక్కి పోయే ఆలోచనే లేదని చిన్నారుకు అందమైన ప్రపంచాన్ని కళ్లముందే ఉంచుతానని నమ్మకంతో చెబుతోంది శ్యామలీరే! ఆమె ఆశయం సాధ్యం కావాని మనందరం ఆశిద్దాం!!