జనాభా సమతుల్యతను సాధించటమే కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారం
కాశ్మీర్‌లో జరిగిన ఎదురు కాల్పులలో ఉగ్రవాది బుర్హన్‌వని మృతి చెందిన అనంతరం జులై 8వ తేది నుండి కాశ్మీర్‌లోయలో నిరంతర ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్ఫ్యూ కూడా విధించబడింది. పరిస్థితులు ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. కాశ్మీర్‌ భారత్‌లో విలీనమైన నాటి నుండి దేశంలో ప్రధానవార్తల్లో కాశ్మీర్‌ ఎప్పుడూ కనబడుతూనే ఉంది. ఒక ప్రక్క పాకిస్తాన్‌, మరోప్రక్క కాశ్మీర్‌లో పనిచేస్తున్న వేర్పాటువాద సంస్థలు, తీవ్రవాద సంస్థలు కాశ్మీర్‌ను ఎప్పుడూ ఘర్షణ వాతావరణంలోనే ఉంచుతున్నాయి. ఈ పరిస్థితును చక్కదిద్దేందుకు సరియైన ప్రయత్నాలు జరగటం లేదు అనేది దశాబ్ధా చరిత్ర మనకు తెలియజేస్తున్నది. ఈ పరిస్థితుకు కారణాలు ఏంటి అనే విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాశ్మీర్‌కు సంబంధించిన సమస్యను పూర్వాపరాలు మనం జాగ్రాత్తగా పరిశీలించినట్లైతే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. కాశ్మీర్‌లో పనిచేస్తున్న సంస్థలు కొన్ని కాశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా ఉంచాని పనిచేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో కలిపేయాని ప్రయత్నం చేస్తున్నాయి. గడిచిన 69 సంవత్సరాలుగా కాశ్మీర్‌లో జరుగున్న పరిణామా సారంశం  కాశ్మీర్‌ పరిష్కారానికి భారత్‌ కఠిన చర్యలు తీసుకోకపోతే పాకిస్తాన్‌ అస్తిత్వం ఉన్నంవతరకు ఈ సమస్య ఇట్లాగే ఉంటుంది. కాశ్మీర్‌ సమస్య ఇట్లాగే ఉండటానికి మరో మౌలిక అంశం ముస్లిం మనస్తత్వమే అని మనకు అర్థమవుతుంది. ముస్లింలు తాము మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో స్వతంత్ర ప్రతిపత్తి కోసం ఎదోరకమైన ఆందోళన చేయటం ఇస్లాం చరిత్రను పరిశీలించినట్లైతే అర్థమవుతుంది. ఎక్కడైనా ముస్లిం మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో వారు చేసే పనులు 1) మతం మార్పిడులు చేయటం 2) భయభ్రాంతును చేసి పారిపోయేట్లు చేయటం చేస్తుంటారు అనేది జగద్వితం. ఈ మధ్య ఉత్తప్రదేశ్‌లో ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతా నుంచి హిందువులులు వెళ్లిపోయినటువంటి వార్తలు మనం పత్రికల్లో చూశాం. ఈ పరిస్థితిని ఈ రోజే కాదు స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి హైదరాబాద్‌లోని పాతబస్తి మొదలుకొని దేశంలో అనేక ముస్లిం మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు ఇవే.
పాకిస్తాన్‌ భారత్‌లో అంతర్భాగంగా ఉన్న కాశ్మీర్‌ను కూడా ఏదో రకంగా కబళించాని గడిచిన 70 సంవత్సరా నుంచి ప్రయత్నం చేస్తున్న విషయం జగద్వితం. అందుకే ఎదురు కాల్పుల్లో చనిపోయిన బుర్హన్‌వనిని ఒక వీరుడిగా కీర్తిస్తూ జులై 19వ తేదిని పాకిస్తాన్‌ ప్రభుత్వమే నిరసన దినంగా ప్రకటించింది. ఇది మన దేశం యొక్క అంతర్గత విషయంలో జోక్యంగా భావించి తీవ్ర నిరసన తెలియచేయవసి ఉంది. కాని మన స్పందన సరిగా లేదు. దేశ విభజన అనంతరం నిర్మాణమైన కాశ్మీర్‌ సమస్య భగవంతుడు భారతదేశానికి ఒక వరంగా ఇచ్చాడు. ఆ వరాన్ని మనం శాపంగా మార్చుకున్నాం. ఎందుకంటే దేశ విభజన సమసిపోయేందుకు చేయవసిన ప్రయత్నాకు కాశ్మీర్‌ ఒక ఆధారంగా కాదగింది. దానిని మనం వదులుకున్నాం. దాని కారణంగా కాశ్మీర్‌ సమస్య రావణకాష్టంగా మారింది. హింసకు హింసే శాశ్వత పరిష్కారం కాదు అందు కోసం ముస్లిం మెజారిటీగా ఉన్న కాశ్మీర్‌ ప్రాంతంలో జనాభా సమతుల్యతను సాధించాల్సిన అవసరం ఉంది. దాని కోసం పదవీ వీరమణ చేసిన సైనికాధికా రుకు అక్కడ నివాసం ఏర్పాటు చేయాలి, అట్లాగే కాశ్మీర్‌లోయను వదిలి పెట్టి వెళ్లిన కాశ్మీర్‌ పండిట్‌కు పునరావాసం కల్పించాలి. తద్వారా జనాభాను సమతుల్యతను సాధించే ప్రయత్నం చేయవచ్చు. మరో ప్రముఖమైన అంశం 1994 సం॥ భారత పార్లమెంట్‌ ఉభయ సభలో కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారం పాకిస్తాన్‌ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్‌ తిరిగి స్వాధీనం చేసుకోని కాశ్మీర్‌ ప్రాంతానికి స్థిరత్వం సాధించాల్సిన అవసరం ఉంది అని తీర్మానించారు. ఈ దిశలో కావాల్సిన ప్రయత్నాను చేయటమే మరోరకంగా కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారం అవుతుంది.