గృహవైద్యం- ఆర్థరైటిస్‌ (కీళ్లనొప్పులు)ఇది కీళ్ళకి సంబంధించిన ఒక రకమైన వ్యాధి. ఈ వ్యాధి ప్రారంభంలో అంతగా బాధ ఉండదు. అందుకని మనం అందరం దానిని చిన్నదే అని వదిలేస్తాము. కానీ ఇదే  క్రానిక్‌ స్టేజ్‌ (దీర్ఘకాలం) లో మాత్రం కీళ్ళలో బిరుసుదనం (stiffness), వాపు బొత్తిగా కద లేకపోవడం వంటి క్షణాలు బాగా తెలియవస్తూంటాయి.. కానీ ఇది ఎందుకు వస్తుందో కొంచెం తెలుసుకుందాం. అలాగే ఎలాగ దాన్ని నివారించవచ్చు కూడా చూద్దాం.
ఈ క్రింది కారణాన ఈ వ్యాధి క్షణాలు కనబడతాయి
·         వాత-ప్రకోపం (అధికం అవ్వడం)
·         ఆమ (పూర్తిగా అరగని పదార్ధం)
·         అధిక మోతాదులో పులిసిన వాయువు వెళ్లి కీళ్ళల్లో నిలిచిపోవడం
·         ఎక్కువగా తినడం
·         పీ శరీర ఆకృతి
·         బద్ధకం వ
·         అజీర్తి
నివారణ :
·         బద్ధకం లేకుండా చూసుకోవాలి
·         ఆమని పూర్తిగా తొగించుకోవాలి
చిట్కాలు
·         నిమ్మకాయ రసం, తేనె  ఒక గ్లాసుడు నీళ్లలో రోజుకు రెండు సార్లు తీసుకోవడం
·         వంకాయని బాగా కాల్చి గుజ్జుకు ఆవనూనెతో పాటు జీకర్ర, పసుపు, వెల్లుల్లి ఉప్పు వేసి రోజుకు రెండుసార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా మూడు నెలు తీసుకుంటే మంచి ఫలితం ఇస్తుంది.
·         ఒక గ్లాసుడు నీళ్లలో 1 పెద్ద చంచా పసుపు కలిపి రోజూ త్రాగాలి
·         ఒక వెల్లుల్లి రెక్కను పచ్చిగా పరగడుపున తినాలి
·         నువ్వు నూనెలో కర్పూరం వేసి నొప్పు ఉన్నచోట మర్దన చేయటం వల్ల మంచి ఫలితం ఇస్తుంది.
దుకాణం దొరికే మందు :గుగ్గులు వీటితో పాటు కొబ్బరినీళ్ళు, బీట్రూట్‌ రసం, కారెట్‌ రసం త్రాగడం, అలాగే గుమ్మడి కాయని తరచూ తీసుకోవడం, అట్లానే జీకర్ర, వెల్లుల్లి కూడా చాలా సహాయపడుతుంది.