కాశ్మీరులో శాంతికి ప్రయత్నాలుభారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి, అప్పటి ప్రధాని క్రియాశూన్యత కారణంగా కాశ్మీరు అశాంతితో అట్టుడుకుతున్నది. పాకిస్తాన్‌ విద్రోహచర్య కారణంగా సమస్య పరిష్కారానికి దూరంగా ఉన్నది. ఇటీవ హిజ్‌బుల్‌-ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌వనీ మరణంతో రెచ్చిపోయిన పాకిస్తాన్‌ తీవ్రవాదులు అల్లకల్లోలం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ స్ఫూర్తితో రూపుదిద్దుకున్న విశ్వగ్రామ్‌అనే సంస్థ శాంతి సాధించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. రెండు దినాలు జరిగే ఒక అంతర్జాతీయ సింపోజయం నిర్వహించింది. శ్రీ ఇంద్రేశ్‌కుమార్‌ మాట్లాడుతూ కాశ్మీరులో పాకిస్తాన్‌ జోక్యాన్ని ఎండగట్టారు. కాశ్మీర్‌ ప్రజలో అత్యధికం శాంతిని కోరుకుంటున్నారని కాని వారికి అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం లేదని అన్నారు. ఈ సింపోజియంలో ముఖ్యమంత్రి మెహబూబాముప్తీ కాశ్మీరు విద్యామంత్రి నసీమ్‌ అఖ్తర్‌ కేంద్రమంత్రి కిరణ్‌రిజ్జు విదేశీ వ్యవహారా ఉపమంత్రి ఎంజే అక్బర్‌ ఇంకా ఇతర ప్రముఖులూ పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చొరవతో కాశ్మీరు సమస్య పరిష్కార దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం!