అంటరానితనం మన సమాజానికి మాయని మచ్చ- శ్రీ భయ్యాజీనాగపూర్‌ కి చెందిన భారత్‌ మంగళం సంస్థ ఆద్వర్యంలో సామాజిక సమరసత అనే ఆంశమీద నిర్వహించబడిన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ కార్యవాహ శ్రీ భయ్యాజి మాట్లాడుతూ, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మరియు బాలాసాహెబ్‌ దేవరాస్‌ ఇద్దరూ కూడా సంఘ సంస్కర్తులుగాను, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేసిన వారుగా కొనియాడారు.
భారతదేశం ప్రపంచానికి విశ్వశ్రేయస్సు అనే విస్తృతమైన అలోచనా విధానాన్ని ఇచ్చిన దేశం. ఈ దేశ సంస్కృతి అతి ప్రాచీనమైనదని, ఇక్కడ నివసించే ప్రజలు సమాజ శ్రేయస్సు కొసం ద్విగుణీకృతమైన శక్తితో ఉంటారని, కాని చరిత్రలో జరిగిన కొన్ని సామాజిక తప్పిదాల వల్ల సమాజంలో అసమానతలు పెరిగిపోయాయి అన్నారు. దురదృష్టవశాత్తు ప్రస్తుత సమాజంలోని రాజకీయ పార్టీలు తమ రాజకీయ స్వార్థం కోసం సామాజిక సమస్యను రాజకీయం చేస్తున్నాయని, ఓటు బ్యాంకు రాజకీయా కోసం వాటిని నిరంతరం రగుల్చుతూ సామాజిక ఘర్షణకు ఆజ్యం పోస్తున్నాయని  అన్నారు. దేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి కూడ కు, మతాకు అతీతంగా ఆలోచించి సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావాన్నారు.
ప్రస్తుత సమాజంకు వివక్షతకు దూరంగా ఉండి, ప్రతి వ్యక్తిని కూడా గౌరవ మర్యాదతో చూడాని శ్రీ భయ్యాజి అన్నారు. స్వార్థ రాజకీయా ఆధిపత్యం చెలాయించడం వల్ల సమాజం విరుద్దమైన మార్గంలో ప్రయాణిస్తుం దన్నారు. లోకమాన్య తిక్‌, మహాత్మ పూలే, జస్టీస్‌ రానాడే మరియు రాజారామ్మోహన్‌ రాయ్‌ వంటి సంఘ సంస్కర్తలు సమాజంలోని దురాచారాను రూపుమాపి సమాజ శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేసారు. అనేక మంది నాయకు సిద్దాంతాకు అతీతంగా సమాజం కోసం పనిచెసారు అని శ్రీ భయ్యాజి గుర్తు చేసారు.
డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ తన జీవితం ద్వారా బహీన వర్గాకే కాకుండా యావత్‌ ప్రపంచానికి ఎలా జీవించాలో మార్గనిర్దేశనం చేసారని, తన ప్రయత్నాతో అణగారిన వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం వల్ల ప్రస్తుతం వారు తమ స్వశక్తితో నిదొక్కుకో గలిగారన్నారు.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక వ్యక్తిలోని ప్రతిభ, గుణా ఆధారంగానే అతని స్థాయి నిర్ణయించబడుతుందని, అందులో కులానికి ప్రాధాన్యత లేదన్నారు. ప్రస్తుత సమాజం కులాకు, వర్గాకు అతీతంగా ఆలోచించి, సోదర భావంతో, ఒక కుటుంబంలా కలిసి మెలిసి ఉండాన్నారు. సమాజానికి జాతి వివక్ష ఒక పెద్ద మచ్చ అని, మనమందరం దానిని రూపుమాపి ఆరోగ్యమైన, సురక్షితమైన సమాజం కోసం, సమసమాజాన్ని తీసుకురావాని, లేనట్లయితే జాతి వివక్ష ఈ దేశానికి పెను సమస్యగా మారనుందన్నారు. కుపరమైన వివక్షను, సామాజిక అసమానతను పూర్తిగా నిర్మూలించాలంటే విభిన్నమైన సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారం మనందరం వెతకాని దానిద్వారా సమాజంలో ప్రతి వ్యక్తి అభివృధ్ది చెందడానికి సమానమైన అవకాశాను కల్పించాన్నారు. క్రింది స్తాయిలో ఉన్న వ్యక్తుకు ఆపన్నహస్తాన్ని అందించి వారిని అభివృద్ది పథంలోకి తీసుకురావడం వల్ల సమసమాజాన్ని స్థాపించి, వ్యక్తులో దేశభక్తిని పెంపొందించి వారందరిని ఏకంచేయడం ద్వారా ఈదేశం గొప్పదేశంగా తీర్చిదిద్దబడుతుంది.